Andhra Pradesh Rice Prices: బియ్యం ధరలకు కళ్లెం.. కిలో రూ.47 నుంచి రూ.82! ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Rice Prices: ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం నిల్వలు, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. బియ్యం ధరలు అధికంగా పెంచి విక్రయించకుండా, అక్రమ నిల్వలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ జారీ చేసిన అనుమతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు వెలువరించింది. బియ్యం రకాలను బట్టి కిలో ధరలను రూ.47 నుంచి రూ.82 వరకు నిర్ణయించింది. వివిధ రకాల బియ్యాన్ని విక్రయించే వ్యాపారులు నిర్ణయించిన ధరల పరిమితులను పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బియ్యం రకాలను బట్టి కిలోకు కనిష్ఠంగా రూ.47 నుంచి గరిష్ఠంగా రూ.82 వరకు ధరలు నిర్ణయించింది. ఈ ధరలకు మించి విక్రయాలు జరిపితే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మిల్లర్లు, డీలర్లకు కొత్త నిబంధనలు
బియ్యం నిల్వలను నియంత్రించేందుకు మిల్లర్లు, డీలర్లకు ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రతి సంస్థ తమ వద్ద అందుబాటులో ఉన్న బియ్యం నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం నిల్వల వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. నిల్వలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ఈ చర్యలు చేపట్టింది. బియ్యం నిల్వలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, తప్పుడు వివరాలు నమోదు చేయడం, రికార్డుల్లో అవకతవకలకు పాల్పడటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే మిల్లర్లు, డీలర్లు, ఇతర వ్యాపార సంస్థలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనుంది. నిల్వల వివరాల్లో పారదర్శకత పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read
- APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
- Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
- AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
- Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
తనిఖీలకు అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు
బియ్యం నిల్వలపై పర్యవేక్షణ పెంచేందుకు అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. బియ్యం నిల్వలు ఎక్కడ ఉన్నా తనిఖీ చేసే అధికారం అధికారులకు కల్పించింది. గోదాములు, ఇతర నిల్వ కేంద్రాలతో పాటు వాహనాలు, నౌకల్లో ఉన్న బియ్యం నిల్వలను కూడా తనిఖీ చేయవచ్చు. నిల్వల పరిమితులను ఉల్లంఘిస్తున్నారా? నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నారా? అనే అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. రాష్ట్రంలో బియ్యం ధరలు నియంత్రణలో ఉండేలా చూడటంతో పాటు అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మిల్లర్లు, డీలర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Anirudh & Kavya Maran Reception: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు వరుసపెట్టిన అతిధి మహారాజులు.!
-
Andhra Pradesh Rice Prices: బియ్యం ధరలకు కళ్లెం.. కిలో రూ.47 నుంచి రూ.82! ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
KL Rahul Record: కేఎల్ రాహుల్ నయా రికార్డు.. 2004 తర్వాత ఇదే మొదటిసారి!
-
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్ప్లే, 33W ఛార్జింగ్!
ట్రెండింగ్
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!