CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలంటే పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన సమయంలో హైదరాబాద్‌లో పెద్దగా ఆసుపత్రులు లేకపోయాయని గుర్తు చేశారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కోడెల శివప్రసాద్ రావు ను గల్ఫ్ దేశాలకు పంపించి అక్కడి హాస్పిటాలిటీ వ్యవస్థను అధ్యయనం చేయించామని తెలిపారు. ఆ సమయంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్లే హైదరాబాద్ దేశానికి మెడికల్ హబ్‌గా మారిందన్నారు.
ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వైద్యులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేర్చుకుంటూ తమ రంగంలో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు, యువతలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే తాను కలలు గన్న అమరావతి నిర్మాణం సాకారం అవుతోందని చంద్రబాబు అన్నారు. ఇటీవల శంఖుస్థాపన చేసిన యూనివర్సిటీ ద్వారా లక్ష వరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం వెల్లడించారు. 2027 నాటికి యూనివర్సిటీ భవనం పూర్తవుతుందని, ఆ భవనాన్ని తానే ప్రారంభిస్తానని పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
విశాఖపట్నంలో కూడా భారీ పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం తెలిపారు. వచ్చే ఆగస్టు 15 కంటే ముందుగానే Google విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు. అలాగే ArcelorMittal సంస్థ 2028 డిసెంబర్ నాటికి తన తొలి దశ పనులను విశాఖ వేదికగా పూర్తి చేస్తుందని వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం ఆటోపైలెట్ విధానంలో ఇస్తుందని, నిర్ణీత గడువులో నిర్మాణం పూర్తి చేయడం మాత్రం సంస్థ బాధ్యత అని స్పష్టం చేశారు. వైద్య రంగంలో డాక్టర్ల కంటే నర్సుల పాత్ర ఎంతో కీలకమని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ కంటే మెరుగైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నగరం ఎంత అభివృద్ధి చెందితే ప్రజల భవిష్యత్తు అంత బాగుంటుందని పేర్కొన్నారు. కృష్ణా నదిపై మరిన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తే అమరావతి అద్భుత నగరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతి మాత్రమే కాకుండా విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. “రాళ్లసీమను రత్నాల సీమగా మారుస్తాం” అంటూ సీఎం చంద్రబాబు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!