Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో సాగుతున్న అల్లు వర్సెస్ మెగా ట్రోలింగ్కి అల్లు అర్జున్ ఫుల్ స్టాప్ పెట్టాడా? ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి, ట్రోలింగ్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు అని తన ఫ్యాన్స్ కి బన్నీ ఎందుకు చెప్పాడు? ఇంతకాలం మెగా హీరోస్ చిరంజీవి, రామచరణ్, పవన్ కళ్యాణ్‌ని ట్రోల్ చేసిన అల్లు ఫ్యాాన్స్కి ఇండైరెక్ట్‌గా ఏమీ అనొద్దనే ప్రయత్నం చేశాడా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. నిజానికి ‘సరైనోడు’ ఈవెంట్ లో “చెప్పను బ్రదర్” అని బన్నీ అనడంతో రచ్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని మెగా ఫ్యాన్స్ అరవడంతో ఇరిటేట్ అయిన బన్నీ “చెప్పను బ్రదర్” అని అన్నాడు. ఈ ఒక్క మాట మెగా వర్సెస్ అల్లు వార్ కి తెరలేపింది. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి అంటే ప్రాణమని, ఈ కట్టె కాలే వరకు ఆయన అభిమానినేనని పేర్కొన్నాడు అల్లు అర్జున్. మెగా వర్సెస్ అల్లు యుద్ధం ఇవాల్టిది కాదు. నాన్-బాహుబలి రికార్డును ‘రంగస్థలం’ బ్రేక్ చేస్తే, ‘రంగస్థలం’ రికార్డును ‘అల వైకుంఠపురములో’ దాటేసింది. అప్పటినుంచి చెర్రీ, బన్నీ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలై చివరికి ఒకరి సినిమాను మరొకరు బ్యాన్ చేస్తామనే వరకు వెళ్ళింది. చిరంజీవికి వీరాభిమానిగా చెప్పుకునే బన్నీ తనను ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసినా తగ్గేదే లేదన్నాడు.
ఏపీ ఎన్నికల్లో బన్నీ స్నేహితుడు, నంద్యాల వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిని బలపరుస్తూ ప్రచారం చేయడం జన సైనికులకు నచ్చలేదు. బన్నీ పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ ఇచ్చినట్లు ఎక్స్ లో పోస్ట్ చేసి, ప్రత్యర్థికి ప్రచారం చేయడంతో విభేదాలు మొదలయ్యాయి. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగిన విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో అలాగే ప్రమాణ స్వీకారోత్సవంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా సీన్ క్రియేట్ అయింది. సుకుమార్ భార్య తబితా నిర్మించిన ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ మాటలు వింటుంటే అల్లు, మెగా ఫ్యామిలీ కలవటం అంత ఈజీ కాదనిపించింది. బన్నీ మాట్లాడుతూ “నా మనసుకు నచ్చితే వస్తా, నాకు ఇష్టమైతే వస్తా” అని నొక్కి మరీ చెప్పడంతో ఏపీ ఎన్నికల్లో వైయస్సార్సీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్ళడాన్ని సమర్ధించుకున్నాడు బన్నీ. ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట సంఘటన తర్వాత బన్నీ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత ముంబైలోనే ఎక్కువగా ఉంటూ ప్రాజెక్ట్ షూటింగ్‌తో గడిపేస్తున్నాడు. తమ్ముడు శిరీష్ పెళ్లిలో, నాయనమ్మ చనిపోయినప్పుడు మెగా హీరోలు అల్లు ఫ్యామిలీకి దగ్గరయ్యారు. లేటెస్ట్గా ఫ్యాన్స్ మీట్లో అల్లు అర్జున్ జనరల్ గా మాట్లాడినా, మెగా హీరోలను ఏమీ అనొద్దని ఇండైరెక్ట్ గా చెప్పినట్లుంది. “ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి. వాళ్ళను ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ సమయం వేస్ట్ చేసుకోవద్దు” అని సలహా ఇచ్చాడు బన్నీ. ఆ టైంను, ఎనర్జీని నచ్చిన పని పైనే పెట్టమన్నాడు. నచ్చని విషయాల కోసం మీ ఎనర్జీలో ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టొద్దని చెప్పాడు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ మధ్యకాలంలో రామచరణ్ పై బన్నీ ఫ్యాన్స్, బన్నీపై మెగా ఫ్యాన్స్ మాటల్లో చెప్పలేనంతగా ట్రోలింగ్ చేసుకున్నారు. మార్ఫింగ్ ఫోటోలతో పర్సనల్ లైఫ్ లోకి కూడా వెళ్ళిపోయారు. నచ్చని వాళ్ళ గురించి ఆలోచించే కంటే నచ్చే పని చేసుకోవడమే మంచిదని సూచించడంతో మెగా హీరోలను ఏమీ అనొద్దని ఫ్యాన్స్ కు హితవు పలికినట్లుగా అల్లు అర్జున్ స్పీచ్ నడిచింది అని చెప్పొచ్చు అంటున్నారు విశ్లేషకులు. మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?