CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిందని, వేలాది మందిపై అక్రమ కేసులు నమోదు చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తనపై కూడా అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. అయితే ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ధైర్యంగా చెప్పగలమని, చేయలేకపోయిన వాటి గురించి కూడా నిజాయితీగా వివరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు అందిస్తున్నామని, ‘తల్లి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మహిళల కోసం ‘స్త్రీ శక్తి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ‘దీపం’ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లపై సాయం అందిస్తున్నామని చెప్పారు. రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేల వరకు సహాయం చేస్తున్నామని, నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.
Also Read
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అండ..
పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని చంద్రబాబు తెలిపారు. సమాజంలో జీవన ప్రమాణాలు పెంచేందుకు ‘పీ4’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, విద్యా-వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ‘సంజీవని’ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఉపాధ్యాయ పోస్టులు, 5,757 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని వెల్లడించారు. ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లించామని గుర్తుచేశారు.
గతంలో అన్నీ తాకట్టుపెట్టారు..!
గత ప్రభుత్వం రాష్ట్ర ఆస్తులను, ప్రభుత్వ ఆదాయ వనరులను సైతం తాకట్టు పెట్టిందని ఆరోపించిన సీఎం, అలాంటి వారికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని విమర్శించారు. ప్రస్తుతం విశాఖ, అమరావతి, తిరుపతిని అభివృద్ధి కేంద్రాలుగా మార్చుతూ అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక, తిరుమల ప్రసాదం విషయంలో గత పాలకులు అపవిత్ర చర్యలకు పాల్పడ్డారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని అన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు.
పెట్టుబడులు ఆకర్షించడంపై ఫోకస్..
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఐటీ సంస్థలు వస్తుండగా, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. గత పాలనలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పెట్టుబడిదారులను తిరిగి ఆకర్షించడంలో విజయం సాధిస్తున్నామని చెప్పారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. కేవలం 36 రోజుల్లో పుట్టపర్తిలో 5వ తరం యుద్ధ విమాన ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్, స్పేస్, డ్రోన్, డిఫెన్స్ రంగాల కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ, కర్నూలు జిల్లాలో బంగారు గని తవ్వకాల ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు..
రాష్ట్రం గత పాలకుల విధ్వంసకర విధానాల వల్ల వెంటిలేటర్‌పై ఉన్న పరిస్థితి నుంచి బయటపడుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రూ.1 లక్ష కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దనున్నామని, వివిధ ఖనిజ వనరుల ఆధారంగా కొత్త పరిశ్రమలు తీసుకువస్తామని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టును 100 రోజుల్లో పూర్తి చేసి కుప్పానికి నీరు అందించామని, కల్యాణి డ్యామ్‌ను కూడా పూర్తి చేసి శ్రీశైలం నుంచి తిరుపతి వరకు నీటి వనరులను విస్తరిస్తామని తెలిపారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు, ఆ పార్టీ ఫేక్ న్యూస్‌తో విష ప్రచారం చేస్తోందన్నారు. మద్యనిషేధం, సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అమరావతి విషయంలో ఊసరవెల్లి రాజకీయాలు చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం సానుకూల రాజకీయాలు చేస్తుంటే, ప్రతిపక్షం విష రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలే మొదటి ప్రాధాన్యమని, దేశం – రాష్ట్ర అభివృద్ధే కూటమి అజెండా అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, రాష్ట్రాభివృద్ధికి సమగ్ర బ్లూప్రింట్ సిద్ధంగా ఉందన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!