Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వంగవీటి.. ఇప్పుడు బయటకు వచ్చారు.. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గురువారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహబంధం నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరువురూ చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను పవన్ కల్యాణ్, రాధాకృష్ణ గుర్తుచేసుకున్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పలు అంశాలను కూడా ప్రస్తావించారని సమాచారం..
ఇక, సమకాలీన రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఇరువురి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై జరిగిన చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ భేటీ పూర్తిగా మర్యాదపూర్వకంగా, ఆత్మీయ వాతావరణంలో సాగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ఈ సమావేశంపై సోషల్ మీడియా వేదికగా జనసేన ప్రకటించింది.. “జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని వంగవీటి మోహనరంగా కుమారుడు, మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి ఇరువురి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో చోటుచేసుకున్న పలు అంశాలను వారు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.” అంటూ ఎక్స్‌లో రాసుకుంది జనసేన పార్టీ..
శ్రీ @PawanKalyan గారితో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ వంగవీటి మోహనరంగా గారి కుమారుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో… pic.twitter.com/A7e9Sorm4g
— JanaSena Party (@JanaSenaParty) September 24, 2026
తాజావార్తలు
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!