CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అమరావతిలో ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకత్వం, ప్రజా ప్రతినిధుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ప్రజల్లో పార్టీపై విశ్వాసం మరింత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కాకుండా జట్టుగా పనిచేసే సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. కొంతమంది నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తాజా సర్వేల్లో వెల్లడైందని చంద్రబాబు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, సర్వేల్లో ప్రతికూలంగా ఉన్న నేతలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే, వారి వ్యక్తిగత వ్యవహారాల వల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితిని మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
కొంతమంది అధికారుల పనితీరులో కూడా లోపాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అలాంటి అధికారులను కూడా గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 1999 ఎన్నికలను ప్రస్తావించిన చంద్రబాబు, అప్పట్లో పార్టీకి నష్టం కలిగించే కొంతమంది నేతలను పక్కన పెట్టడం వల్లే విజయం సాధించగలిగామని గుర్తు చేశారు. పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన సంకేతాలిచ్చారు.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
సమావేశంలో కొందరు ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారని, పార్టీ ప్రయోజనాల కోసం సూచనలు చేస్తే కొందరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లి వ్యాఖ్యలు చేస్తున్నారని ఓ ఎంపీ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, ఇలాంటి పరిస్థితులు రాజకీయాల్లో సహజమేనని అన్నారు. తనను కూడా విమర్శించే వారు ఉంటారని, అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోకుండా పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాలని నాయకులకు సూచించారు.
తాజావార్తలు
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!