AP MLC Elections 2024: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. నేడు నామినేషన్ వేయనున్న ఆ ఇద్దరు
- నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ప్రయార్టీ ఇస్తున్న సీఎం చంద్రబాబు..
- బలిజ - కాపు కాంబినేషన్‌తో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక..
- బలిజ సామాజిక వర్గం పెద్దగా గుర్తింపుఉన్న సి రామచంద్రయ్య ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక..
- జనసేనలో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన హరి ప్రసాద్‌కు అవకాశం..
- నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులుగా నామినేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MLC Elections 2024: ఆంధ్రప్రదేశ్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు కూటమి నేతలు.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఈ కాంబినేషన్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది.. చెప్పినట్టుగానే ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ప్రయార్టీ ఇస్తున్నారు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. జనసేన నుంచి అభ్యర్థి ఫైనల్ అవుతారని ఎవ్వరూ ఊహించ లేదంటున్నాయి కూటమి వర్గాలు. భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టుల్లోనూ జనసేన, బీజేపీలకు ప్రయార్టీ ఖాయమని సంకేతాలు ఇచ్చారు.. బలిజ – కాపు కాంబినేషన్‌తో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశారు.. అంతేకాదు.. కడపపై మరింత ఫోకస్ పెట్టింది టీడీపీ.. బలిజ సామాజిక వర్గం పెద్దగా గుర్తింపుఉన్న సీనియర్ లీడర్ సి రామచంద్రయ్యను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు చంద్రబాబు.. మరోవైపు.. గత కొన్నేళ్లుగా జనసేనలో కీలకంగా వ్యవహరిస్తోన్న కాపు సామాజిక వర్గానికి చెందిన హరి ప్రసాద్‌కు అవకాశం కల్పించారు.. దీంతో.. శాసన మండలిలోనూ జనసేనకు ప్రాతినిధ్యం లభించబోతోంది.. శాసన మండలిలో జనసేన తొలి సభ్యుడిగా హరి ప్రసాద్ అడుగుపెట్టబోతున్నారు.
Read Also: CM Chandrababu: రహదారులపై ఫోకస్.. నేడు రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష
Also Read
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్‌లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
ఇక, నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు సి.రామచంద్రయ్య, హరిప్రసాద్.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్ దాఖలకు నేడు చివరి రోజు కాగా.. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది.. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్.. అయితే, వారిలో సి.రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన తెలుగుదేశం. మరో స్థానo జనసేనకు కేటాయించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ కు అవకాశం ఇచ్చారు.. శాసనసభలో కూటమికి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా.. సి.రామచంద్రయ్య, హరిప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!