Aarava Sridhar controversy: అరవ శ్రీధర్ వ్యవహారంపై బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్ పరువు తీస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aarava Sridhar controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత అరవ శ్రీధర్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది.. సదరు మహిళ వరుస వీడియోలు విడుదల చేయడంతో సంచలనంగా మారింది.. అయితే, అరవ శ్రీధర్ వ్యవహారంపై స్పందించిన జనసేన సీనియర్ నేత, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరువు తీస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా అధికారంలోకి రావడంతో కొందరు దారి తప్పుతున్నారని అభిప్రాయపడ్డారు. అరవ శ్రీధర్ వ్యక్తిగత విషయాలను పార్టీపై రుద్దడం సరైంది కాదని బొలిశెట్టి పేర్కొన్నారు. చిన్న స్థాయి వ్యక్తులను ఎమ్మెల్యేలు చేస్తే, వారు బాధ్యతగా వ్యవహరించాల్సిందిపోయి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే అది పవన్ కల్యాణ్ పరువు తీసినట్టేనని వ్యాఖ్యానించారు.
Read Also: రూ.7,499కే HD+ LCD స్క్రీన్, IP64 రేటింగ్, Android 15 Goతో Lava Yuva Star 3 లాంచ్..
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పోరాటం చేసి, కష్టపడ్డాం.. జైళ్లకు కూడా వెళ్లి కేసులు ఎదుర్కొని ఎమ్మెల్యేలు అయ్యామని గుర్తుచేశారు బొలిశెట్టి శ్రీనివాస్… కానీ కొంతమంది ఒక్కసారిగా అధికారాన్ని చూసి దారి తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, అసెంబ్లీ సమావేశాలకు రావడానికి మొహం చెల్లడం లేదేమోనని వ్యాఖ్యానించిన ఆయన, ఎక్కడా కూడా అసెంబ్లీకి రావద్దని అరవ శ్రీధర్‌కు చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం మరియు పార్టీ కార్యక్రమాలలో మాత్రమే పాల్గొనవద్దని పార్టీ ఆదేశించిందని వెల్లడించారు జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. కాగా, ఈ వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..