బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుంది బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని సీఎం రేవంత్ అంటున్నాడు.. కానీ ప్రధాని ఒరిజినల్ బీసీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో పరిగెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో భారత దేశం కీర్తి ఖండాంతరాలు దాటి వెళ్ళిందని ఆయన అన్నారు.…
సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో గ్రూప్-2 అంధ విద్యార్థిని సంజనకు అన్యాయం జరిగింది. గుంటూరు నుంచి కడపకు గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు వచ్చిన అంధ విద్యార్థిని సంజన.. సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పరీక్ష రాయలేకపోయింది.
మన అకేషన్స్ కోసం పరీక్షలు అస్సలు వాయిదా పడవు. అందుకే పరీక్షలు ఉన్నప్పుడు.. పెళ్లి, ఇతర ముహూర్తాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతాం. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా పెళ్లి ముహూర్తం రోజున పరీక్ష రాయాల్సి వస్తుంది. అప్పుడు చాలా మంది తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఓ వధువు మాత్రం అలా అనుకోలేదు. ఉదయం పెళ్లి చేసుకుని.. నేరుగా పరీక్షా హాలుకి చేరుకుంది. ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10…
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేందుకు డెడ్ లైన్ 9.45 కావటంతో.. పరీక్షా కేంద్రాల వద్ద గేట్లకు సిబ్బంది తాళాలు వేశారు. ఇదే సమయంలో విజయవాడ నలంద విద్యా నికేతన్‌లోని గ్రూప్-2 పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా దివ్యాంగుడైన అభ్యర్ధి వచ్చారు. అయితే తన భర్త దివ్యాంగుడు కావటంతో పరీక్షకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అతడి భార్య ప్రాధేయ పడింది. దీంతో దివ్యాంగునికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు హాజరయ్యేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు గ్రూప్-2 ప్రధాన పరీక్ష జరగనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. టైం దాటితే లోపలకు అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ స్పష్టం…
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? లేదా? అనే గందరగోళ పరిస్థితిలో ఉన్న అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. రేపు గ్రూప్- 2 ఉద్యోగాల నియామకం కోసం మెయిన్స్ పరీక్ష యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది ఏపీపీఎస్సీ.. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష ఉంటుందని.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గ్రూప్ 2 మెయిన్స్ పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై APPSCకి లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుంది ప్రభుత్వం.. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా కోరుతూ ప్రభుత్వం లేఖ…