Peddi : రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. ఈ మూవీ ఫస్ట్ షాట్ వచ్చినప్పటి నుంచి మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక తరచూ ఈ మూవీ గురించి ఎవరో ఒకరు కామెంట్ చేస్తున్నారు. మొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ.. రంగస్థలం కంటే పెద్ది గొప్పగా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు తాజాగా బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ గురించి ఓ సీక్రెట్ చెప్పాడు.
Read Also : CISF: ఇంటర్ పాసయ్యారా? హెడ్‌కానిస్టేబుల్ జాబ్స్ మీకోసమే.. ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్!
అందరూ పెద్ది మూవీలో క్రికెట్ మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారు. కానీ క్రికెట్ ను మించి సినిమాలో ఎమోషన్ చాలా ఉంటుంది. అదే మూవీకి అతిపెద్ద ప్లస్ పాయింట్. దాన్ని బేస్ చేసుకునే సీన్లు ఉంటాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఇప్పటి వరకు మీరు ఎవరూ చూడని పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. పాత్ర కోసం ఆయన చాలా మారిపోయారు. లుక్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నారు’ అంటూ తెలిపాడు బుచ్చిబాబు.
Read Also : WAR 2 : రిటర్న్ గిఫ్ట్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా : జూనియర్ ఎన్టీఆర్