గతంలో రెండు సందర్భాల్లో మంత్రి నారా లోకేష్ ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు ప్రధాని మోడీ.. దీంతో, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ అడిగారట లోకేష్.. ఇక, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో.. హస్తినబాట పట్టనున్నారు.. రేపు సాయంత్రం కలవాలని ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో.. రేపు ప్రధాని మోడీతో నారా లోకేష్ సమావేశం అవుతున్నారు..
ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లనున్న నారా లోకేష్.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఈ రోజు రాత్రికి భేటీ కానున్నారు. ఇటీవల రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలపనున్నారు.