Minister Anagani Satya Prasad: 22ఏ జాబితా నుండి భూముల తొలగింపు.. మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satya Prasad: 22ఏ నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ బడ్జెట్ కేటాయింపులపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల 22ఏ జాబితాలో అనేక భూములు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 22ఏ జాబితా నుంచి భూములను తొలగించే ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి అధికారాల బదలాయింపు చేపట్టినట్లు చెప్పారు.
Read Also: Ram Mandir: అయోధ్య ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ‘‘రామ మందిరం’’.. గణాంకాలు చూడండి..
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే అధికారాన్ని ఆర్డీవోలకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి అనగాని… ఇకపై ఏదైనా భూమిని 22ఏ జాబితాలో చేర్చాలంటే సంబంధిత పట్టాదారునికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేదా ఈ-కేవైసీ విధానంలో నోటీసు ఇవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనంతరం సమగ్ర విచారణ జరిపి, సరైన కారణాలతోనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇక, పదేళ్లకు పూర్వం అసైన్ చేసిన ఇంటి స్థలాలకు పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే ఇనాం భూముల సమస్యపై నియమిత జీవోఎం త్వరలో సమగ్ర పరిష్కారం సూచించనుందని చెప్పారు.
మరోవైపు, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు మంత్రి అనగాని… రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడానికి బ్లాక్‌చైన్ సాంకేతికతను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పాత రెవెన్యూ రికార్డులను ఆధునిక పద్ధతులతో స్కాన్ చేసి, శాశ్వత డిజిటల్ గుర్తింపుతో భద్రపరచనున్నట్లు చెప్పారు. ఇక, గత ప్రభుత్వ కాలంలో రీ-సర్వే మరియు ల్యాండ్ టైట్లింగ్ చట్టాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై అక్రమ ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. భూముల విషయంలో ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!