AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్కామ్‌పై ఇప్పుడు ఆదాయపన్ను శాఖ (ఐటీ) దృష్టి సారించింది. సుమారు రూ.2000 కోట్ల అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి, పన్ను ఎగవేత కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో డబ్బు ప్రవాహం, అక్రమ సంపాదన మార్గాలు, నిధుల తరలింపు విధానాలపై ఐటీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హవాలా మార్గం ద్వారా డబ్బు విదేశాలకు తరలించబడినట్టు అనుమానిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ నిధులు దుబాయ్‌కు మళ్లించబడినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. నెలకు రూ.50 నుంచి 60 కోట్ల వరకు అక్రమ నగదు సృష్టించబడినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే, డిస్టలరీల నుంచి వెండర్లకు ఐదు రెట్లు ఎక్కువగా చెల్లింపులు జరిగినట్లు కూడా వెల్లడైంది. ఈ లావాదేవీల వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా, ఎలాంటి సరుకుల సరఫరా జరగకపోయినా, ఫేక్ ఇన్వాయిస్‌లు సృష్టించి రెండు డిస్టిల్లరీలు సుమారు రూ.76.92 కోట్లను తరలించినట్టు గుర్తించారు. ఈ విధంగా డిజిటల్ ట్రైల్‌ను తప్పించుకునేందుకు మొత్తం లావాదేవీలను ‘బ్లాక్ మనీ’గా దాచిపెట్టినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో పాల్గొన్న అనుమానితులపై త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం వ్యవహారంపై ఐటీ శాఖ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంటుండటంతో, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశముంది.
Also Read
- CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
- Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
తాజావార్తలు
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
-
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
-
Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
ట్రెండింగ్
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..