Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Party: ఆంధ్రప్రదేశ్‌లో స్థానికల ఎన్నికల హడావిడి మొదలైంది.. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణకు సిద్ధమవుతోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు స్థానిక ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై చర్చించారు. 30 రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని జనసేన నేతలు స్పష్టం చేశారు. యువత, మహిళల సాధికారతను పార్టీ ప్రధాన ప్రాధాన్య అంశాలుగా పేర్కొన్నారు. జన సైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. ‘సిద్ధం’ అన్న వ్యక్తే ఇప్పుడు ‘యుద్ధం’ అంటున్నారని జనసేన నేతలు వ్యాఖ్యానించారు. యుద్ధానికి జనసేన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని చూపించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.
Also Read
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవస్థలను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జనసేనను లక్ష్యంగా చేసుకున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. అయినప్పటికీ అప్పటి పరిస్థితుల్లో జనసేన గణనీయమైన ఫలితాలు సాధించిందని గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో కూడా యుద్ధ వాతావరణంలో పోరాడిన జనసేనకు ప్రజల మద్దతు లభించిందని తెలిపారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన 2 జడ్పీటీసీలు, 177 ఎంపీటీసీలు, 1,209 సర్పంచులు, 1,576 ఉప సర్పంచులు, 4,456 వార్డు మెంబర్లను గెలుచుకుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. రాబోయే స్థానిక పోరులో మరింత బలంగా పనిచేసి పార్టీ సత్తా చాటాలని నిర్ణయించారు. ఇక, పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా భాగస్వాములను చేయడంతో పాటు, స్థానిక స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.
తాజావార్తలు
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!