PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PG Doctors New Rules: పీజీ వైద్య విద్యార్థుల విధులు, సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పీజీ వైద్యులను 24 గంటలకు మించి వరుసగా డ్యూటీ చేయించకూడదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నైట్ డ్యూటీ చేసిన పీజీ వైద్యులకు మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రతి వారం ఒక రోజు పూర్తి సెలవు కల్పించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకుంటామని డీఎంఈ హెచ్చరించారు.
పీజీ వైద్య విద్యార్థులపై పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. విద్యార్థుల కోసం కౌన్సెలింగ్, టైమ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా పీజీ వైద్య విద్యార్థులకు సెలవుల విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి 20 రోజుల పెయిడ్ క్యాజువల్ లీవులు, 5 రోజుల అకడమిక్ లీవులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటితో పాటు సంవత్సరంలో 52 వారాంతపు సెలవులు కూడా కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Also Read
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
పీజీ వైద్యుల పని గంటలు, విశ్రాంతి, సెలవుల విషయంలో ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని డీఎంఈ స్పష్టం చేశారు. వైద్య విద్యార్థుల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!