ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో వేలల్లో తగ్గింపు ప్రకటించింది. కొత్తగా ఫోన్ కొనాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఫ్లిప్ కార్ట్ లో మోటరోలకు చెందిన ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 11 వేల తగ్గింపుతో లభిస్తుంది. MOTOROLA Edge 50 పై 33 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ. 32,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 21,999కే దక్కించుకోవచ్చు.
Also Read:Kollywood : తన పేరు నుండి తండ్రి పేరు తీసేసిన యంగ్ హీరో
మోటోరొలా ఎడ్జ్ 50 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ తో వస్తుంది. మోటోరొలా ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.7 ఇంచెస్ 1.5కె సూపర్ హెచ్‌డీ పోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 1900నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7జెన్ 1ఏఈ చిప్‌సెట్ అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హల్లో యూఐతో పనిచేస్తుంది. 50ఎంపీ సోనీ లిటియా 700సీ సెన్సర్, 10 ఎంపీ టెలిఫొటో షూటర్, 13 ఎంపీ సెన్సర్, 32ఎంపీ సెల్ఫీ కెమెరా అందించారు. 5,000 mAh బ్యాటరీ (68W టర్బోఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్) తో వస్తుంది. ఐపీ68 రేటింగ్ కలిగి ఉంది.