AP High Court: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్వాష్ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.. సింగయ్య మృతి కేసు క్వాష్ చేయాలని వైఎస్ జగన్ సహా పలువురు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.. అయితే, ఇప్పటికే కేసు విచారణపై స్టే విధించింది న్యాయస్థానం.. తాజాగా, ప్రభుత్వం సమయం కోరటంతో విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు..
Read Also: King Charles: బ్రిటన్ రాజు చార్లెస్‌ను కలిసిన టీమిండియా..!
కాగా, వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా పర్యటన తీవ్ర వివాదాస్పదం అయ్యింది.. వైసీపీ కార్యకర్త సింగయ్య మృతితో జగన్‌పై విమర్శలు గుప్పించారు కూటమి నేతలు.. ఈ కేసులో వైఎస్ జగన్ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఆయన.. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు .. కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చిన విషయం విదితమే.. ఇక, రెండు వారాల వాయిదా తర్వాత.. ఈ రోజు విచారణ జరిగినా.. మరో రెండు వారాలకు తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు..