CM Chandrababu Delhi visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సహాయాలపై కీలక చర్చలు జరపనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు.. అదే రాత్రి కేంద్రంలోని కీలక నాయకులను, ఉన్నతస్థాయి అధికారులను ఆయన కలిసే అవకాశం ఉంది.. ఇక డిసెంబర్ 19న సీఎం చంద్రబాబు మొత్తం రోజంతా ఢిల్లీలోనే ఉండనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంట్ హౌస్‌లో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు కానున్నారు.
Read Also: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే టాప్ 10 అద్భుత ఆహారాలు – మీ డైట్‌లో తప్పక చేర్చండి!
ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి అవసరమైన కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులు, ఆమోదాలు ఇలా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 18వ తేదీ రాత్రే కేంద్రంలోని పలువురు టాప్ లీడర్లతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ పర్యటన కీలకంగా మారనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి..