ఆపిల్,సీతాఫలం : ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండి, కొలెస్ట్రాల్ తగ్గించి కిడ్నీలను రక్షిస్తుంది.
బెర్రీలు : యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, ఇన్ఫ్లమేషన్ తగ్గించి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఎగ్ వైట్స్: హై క్వాలిటీ ప్రోటీన్ అందించి, ఫాస్ఫరస్ తక్కువగా ఉండటంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆలివ్ ఆయిల్ : ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటంతో కిడ్నీలను రక్షిస్తుంది.
ఫిష్: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి, గుండె, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఎర్ర కాప్సికమ్: తక్కువ పొటాషియం, విటమిన్ సి, ఎ లైకోపీన్ ఉండి, యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
క్యాబేజీ : తక్కువ పొటాషియం, విటమిన్లు సమృద్ధిగా ఉండి,కిడ్నీలపై ఒత్తిడి తగ్గిస్తుంది.
వెల్లుల్లి : యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండి, రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలు : ఫ్లేవనాయిడ్స్ ఉండి, కిడ్నీల ఫంక్షన్ మెరుగుపరుస్తాయి.
కాలీఫ్లవర్ : విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.
గమనిక: ఇవి సాధారణంగా కిడ్నీల ఆరోగ్యానికి మంచి ఆహారాలు. కిడ్నీ సమస్య ఉంటే డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోండి.