SSMB 29 : రాజమౌళి ఏది చేసినా అందులో ఓ స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి సినిమాకు రాజమౌళి కొందరిని రిపీట్ చేస్తుంటాడు. సినిమాటోగ్రాఫర్ ను, మ్యూజిక్ డైరెక్టర్ ను, కొందరు నటులు, ఇంకొందరు టెక్నీషియన్లను ఎప్పుడూ కంటిన్యూ చేసే జక్కన్న.. మహేశ్ బాబుతో చేసే సినిమాకు మాత్రం రివర్స్ లో వెళ్తున్నాడు. ఈ సినిమా కోసం అందరినీ కొత్తవారినే తీసుకుంటున్నాడంట రాజమౌళి. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ బయట పెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెంథిల్.. రాజమౌళి సినిమాకు ఎందుకు పనిచేయట్లేదో చెప్పాడు. ఈ సినిమాకు రాజమౌళి అందరూ కొత్త వారినే తీసుకుంటున్నాడు. అందుకే నేను పనిచేయట్లేదు. భవిష్యత్ లో మేం కలిసి పని చేస్తాం అంటూ తెలిపాడు సెంథిల్.
Read Also : Lokesh Kanagaraj : ‘కూలీ’ కోసం లోకేష్ భారీ రెమ్యునరేషన్..
అయితే రాజమౌళి ఎందుకు అందరినీ కొత్త వారినే తీసుకుంటున్నాడనేది ఇక్కడ ప్రశ్న. మహేశ్ తో చేయబోయే మూవీ ప్రపంచ వ్యాప్తంగా షూటింగ్ జరుగుతుందంట. ఇందులో కొన్ని కొత్త ప్రయోగాలు చేస్తున్నాడంట జక్కన్న. పైగా గ్రాండియర్ విజువల్ వండర్ రేంజ్ లో మూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ స్థాయి టెక్నాలజీ కోసం ఎవరు వర్కౌట్ అయితే వారినే తీసుకుంటున్నాడంట జక్కన్న. టెక్నీషియన్లు కూడా జక్కన్న స్పెషల్ గా వెతికి మరీ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ పరంగా కొత్తగా ప్రయోగం చేసి దాని రిజల్ట్ ను వేరే లెవల్ లో ఉంచాలని ప్లాన్ చేస్తున్నాడంట. నటీనటులు కూడా తెలుగు నుంచి కాకుండా బయటి వారినే ఎక్కువగా తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అన్ని ప్రాంతాల వారికి అవకాశాలు ఇస్తున్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. ఈ మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అన్ని ప్రాంతాల్లో క్రేజ్ ఉన్న వారికి అవకాశాలు ఇస్తున్నాడంట జక్కన్న.
Read Also : stuntman Mohanraju death : మా తప్పేం లేదు.. స్టంట్ మ్యాన్ మృతిపై డైరెక్టర్ రంజిత్ క్లారిటీ..