AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. అమరావతి అభివృద్ధిపై ఫోకస్.. వారికి గుడ్‌న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, రైతుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊరట కల్పించే నిర్ణయాలు మంత్రివర్గం ముందుకు రానున్నాయి. రాజధాని కోసం కొత్తగా భూములు ఇచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.40 వేల యాన్యుటీ మంజూరు చేయడంతో పాటు, గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి నెలకు రూ.10 వేల అద్దె భత్యం అందించే ప్రతిపాదనపై ఆమోదం లభించనుంది. కొత్త పూలింగ్ గ్రామాల రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ కల్పించేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.
అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు సీఆర్డీఏ ప్రతిపాదనలు కూడా సమావేశంలో పరిశీలనకు రానున్నాయి. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం, దేవాదాయ శాఖ భూముల బదిలీ కోసం దేవాదాయ శాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక అక్వేరియం, కార్యాలయ నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమి కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ఇదే సమావేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాలు, ఈశా ఫౌండేషన్‌కు భూమితో పాటు పార్కు వినియోగ హక్కులు, నిర్వహణ బాధ్యతలు, అలాగే సీఐఐకు నాలుగు ఎకరాల భూమి కేటాయింపుపై ఆమోదం లభించే అవకాశం ఉంది. మరోవైపు.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 19వ సమావేశంలో ఆమోదించిన 11 ప్రాజెక్టులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వీటి ద్వారా సుమారు రూ.9,076 కోట్ల పెట్టుబడులు ఆకర్షితమై, 10,531 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది. సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?