AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇక, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం..!
- ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు..
- కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం..
- ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతి..
- రూ. 100లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని నిర్ణయం..
- రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం.. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 100లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది.. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
Read Also: One Nation-One Election: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంటే ఏంటి?
Also Read
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
- Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
మరోవైపు.. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.. వచ్చే దీపావళి నాటికి మహిళలకు కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్లో చర్చ జరిగింది.. ఉచిత వంట గ్యాస్ అందిద్దామా..? లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా..? అనే అంశంపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకం వైపే మెజార్టీ మంత్రుల మొగ్గు చూపారట.. ఇక, బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు.. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు.. బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫార్సు చేసింది ఏపీ కేబినెట్.. దీంతో.. బీసీలకు రిజర్వేషన్ల తీర్మానంపై చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సవిత..
Read Also: Delhi: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఇక, వాలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్లో చర్చ జరిగింది.. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని తెలిపారు అధికారులు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వాలంటీర్లతో వైఎస్ జగన్ రాజీనామా చేయించాడని పలువురు మంత్రులు గుర్తుచేశారు.. తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని విమర్శించారు.. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!