AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమవేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆగస్టు 15 నుండి స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అమలు చేయబోతున్నారు.. ఇక, ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిప్ట్) పాలసీ 4.0… 2024-29కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. 22 ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ హోటళ్లు, ఆరు క్లస్టర్ల పరిధిలోని రిసార్టుల ఆపరేషన్లకు ఏజెన్సీల ఎంపికకు వీసీ అండ్ ఎండీకి అనుమతులు మంజూరు చేసింది..
Read Also: YS Jagan Dhone tour: వైఎస్ జగన్ పర్యటనలో అపశృతి..
ఇక, తిరుపతి రూరల్ మండలంలోని పేరురు గ్రామంలో 25 ఎకరాల భూమినికి బదులుగా గతంలో ఓబరాయ్ హోటళ్ల గ్రూపుకు నిర్మాణానికి ఇచ్చిన టీటీడీ ల్యాండ్ బదిలీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు 900 కోట్లు గ్యారెంటీని పవర్ సెక్టార్‌లో ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు, హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత విద్యుత్ ను 150 యూనిట్ల నుండి 200 యూనిట్లకు పెంచే అంశంపై మంత్రిమండలిలో ఆమోదం లభించింది.. ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీ సీపీడీసీఎల్‌లకు 3545 కోట్లు, 1029 కోట్లు వరుసగా గతంలోనే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసిన బుణానికి గాను ప్రభ్యుత్వ గ్యారెంటీపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు..
Read Also: Kartavya Bhavan 3 Inaugurate: కర్తవ్య భవన్-3ను ప్రారంభించిన ప్రధాని మోదీ..!
పాఠశాల విద్యలో పలు జీవోలను ర్యాటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్.. ఇక, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు).. దాని అనుబంధ సంస్థలు, రివల్యూషనరీ డెమెక్రటిక్ ఫ్రంట్ లపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు.. మరోవైపు, పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతిలో 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు రెగ్యూలర్ బేసిస్ మీద పోస్టుల క్రియేషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.. కొత్త బార్ పాలసీకి ఆమోదం తెలిపింది కేబినెట్.. బార్ పాలసీ 2025-2028కి ఆమోదం తెలిపిన కేబినెట్.. కొత్త బార్ పాలసీలో కల్లు గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నారు.. ఏపీఐఐసీకి 7,500 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, భూసేకరణ కోసం నిధుల వినియోగం చేయనుంది ఏపీఐఐసీ.. మొత్తంగా అటు మహిళలు, ఇటు హెయిర్ కటింగ్ సెలూన్లు, మరోవైపు గీత కార్మికులకు.. ఇంకో వైపు పారిశ్రామిక వర్గాలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేబినెట్.. మావోయిస్టులకు మరోసారి షాక్ ఇచ్చింది..