Kajal Aggarwal: “అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు”.. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన సినీ కెరీర్లో ఎదురైన ఓ చేదు ఘటనను తాజాగా వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటన గురించి ఆమె తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ అగర్వాల్.. ఒక సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత తన కారవాన్‌లో ఉన్న సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తన ఫర్మిషన్ తీసుకోకుండానే లోపలికి వచ్చాడని తెలిపారు. అనంతరం అతని ఛాతిపై తన పేరుతో వేయించుకున్న టాటూను చూపించాడని చెప్పారు.
ఆ సంఘటన తనను తీవ్ర ఇబ్బందికి గురి చేసిందని కాజల్ వెల్లడించారు. “అతను నా పేరుతో టాటూ వేయించుకోవడం వెనుక అభిమానమే ఉండొచ్చు. కానీ నా అనుమతి లేకుండా కారవాన్‌లోకి రావడం, నా వ్యక్తిగత హద్దులను దాటేలా ప్రవర్తించడం మాత్రం సరైన విషయం కాదు” అని ఆమె స్పష్టం చేశారు. సెలబ్రిటీలపై అభిమానాన్ని చూపించడం తప్పు కాదని, అయితే వారి వ్యక్తిగత గోప్యతను, వ్యక్తిగత హద్దులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కాజల్ పేర్కొన్నారు. అభిమానమనే పేరుతో అనుమతి లేకుండా వ్యక్తిగత ప్రదేశాల్లోకి ప్రవేశించడం లేదా ఎదుటివారిని అసౌకర్యానికి గురిచేసేలా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం కాదని ఆమె వ్యాఖ్యానించారు. కాజల్ అగర్వాల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రత, ప్రైవసీపై మరోసారి చర్చకు దారితీశాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ NBK111, రామాయణ వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Also Read
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
తాజావార్తలు
-
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?