Survey on Work From Home: సర్కార్ కీలక నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోంపై సర్వే..
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
- వర్క్ ఫ్రమ్ హోంపై సర్వే నిర్వహించాలని నిర్ణయం..
- 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవారి వివరాల సేకరణ..
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఈ సర్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Survey on Work From Home: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. వర్క్ ఫ్రమ్ హోంపై కూడా సర్వే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.. వర్క్ ఫ్రమ్ హోమ్ కు సంబంధించి ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది.. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవారి వివరాలను ఈ సర్వే ద్వారా సేకరిస్తారు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఈ సర్వే నిర్వహించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా టెక్నీకల్ స్కిల్.. విద్యార్హతలు.. ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించి వివరాల సేకరిస్తారు.. మార్చి 10వ వరకు సర్వే నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.. అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మరింత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.. ప్రస్తుతం చేస్తున్న వర్క్‌తో పాటు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.. సర్వే తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఎక్కువ మంది ఆసక్తి చూపితే.. ప్రత్యేక సెంటర్లను కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.. బ్రాండ్ బ్యాండ్ కనెక్టవిటీ.. స్పీడ్ ఇంటర్ నెట్.. తగిన వసతి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది..
Read Also: YS Jagan: వైరల్ ఫీవర్‌తో బాధపడుతోన్న జగన్.. అయినా రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభోత్సవం
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
కాగా, ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి తర్వాత దిగ్గజ కంపెనీలు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లోకి వెళ్లియి.. ఇప్పటికే పలు కంపెనీల్లో ఇది కొనసాగుతున్నాయి.. ఇంకా కొన్ని సంస్థల్లో వారానికి ఒకటి రెండు సార్లు వర్క్ ప్లేస్‌కు వస్తే సరిపోతుంది.. మిగతా రోజుల్లో ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కూడా కల్పించాయి.. అయితే, ఉద్యోగ కల్పనపై దృష్టిసారించిన ఏపీలోని కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పలు సంస్థలను ఆహ్వానించింది.. ఇదే సమయంలో.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మొగ్గుచూపే వారికి సైతం ప్రత్యేక ఉపాధి కల్పనపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అందులో భాగంగానే వర్క్ ఫ్రమ్ హోమ్‌పై సర్వేకు సిద్ధమవుతోంది.. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీయనుంది సర్కార్..
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!