Amaravati Capital Works: అమరావతి రాజధాని పనులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- అమరావతి రాజధాని పనులపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- ఏప్రిల్ 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనుల ప్రారంభం..
- సచివాలయం వెనక ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం..
- రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ..
- ఏర్పాట్లపై సీఆర్డీఏ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital Works: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులపై కీలక నిర్ణయం తీసుకుంది.. వచ్చే నెల అంటే ఏప్రిల్ 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది.. ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనక ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం.. ఇక, అమరావతి రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, సచివాలయం వెనక వైపు ప్రాంతంలో రాజధాని పనులు ప్రారంభించాలని.. అదే ప్రాంతంలో సభ కూడా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడాల్సిందిగా సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: Nag Ashwin: నాని – విజయ్ దేవరకొండ వివాదాలపై నాగ్ అశ్విన్ రియాక్షన్..
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
కాగా, కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే పలు రకాల పనులకు సీఆర్డీఏ అనుమతి ఇవ్వడం.. దానికి కేబినెట్ సమావేశ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.. అయితే, ఇవాళ సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు.. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు.. అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన.. రాజధాని పనుల పునఃప్రారంభానికి సంబంధించిన స్థలం ఎంపిక, ముహూర్తం, ఇతర ఏర్పాట్లపై అధికారులతో సీఎం ప్రిలిమినరీ సమావేశం నిర్వహించారు.. ఇక, ప్రధాని మోడీ టూర్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. అమరావతి రాజధాని రీ లాంచ్ కు ప్రధాని మోడీ రాబోతున్నారు.. వచ్చే నెల రెండో వారంలో అమరావతిలో పర్యటించనున్నారు మోడీ.. మొత్తంగా ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనక ప్రాంతంలో రాజధాని పనుల రీ లాంచ్.. అదే ప్రాంతంలో ప్రధాని బహిరంగ సభ నిర్వహించేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!