Andhra Pradesh: కష్టపడి డీఎస్సీ కొట్టింది.. ఉద్యోగంలో చేరాల్సిన సమయంలో కన్నుమూసింది..
- టీచర్ ఉద్యోగం కోసం కష్టపడి చదివింది..
- మంచి మార్కులతో డీఎస్సీలో అర్హత సాధించింది..
- ఫిజికల్‌గా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాల్సిన సమయం వచ్చింది..
- క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూసింది..
Andhra Pradesh: ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని పట్టుబట్టింది.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగం సంపాదించి.. తన భవిష్యత్‌ను తీర్చుదిద్దుకోవడంతో పాటు.. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలని కలలు కనింది.. దాని కోసం ఎంతో కష్టపడి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హత సాధించింది.. అన్నీ అనుకూలిస్తే.. త్వరలోనే టీచర్‌గా పాఠాలు చెప్పాల్సిన సమయంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. అనారోగ్య సమస్యలతో కన్నుమూసింది ఓ యువతి..
Also Read
Read Also: Box office results : అనుకున్నదే జరిగింది.. కూలీ, వార్ 2 ని వెనక్కి నెట్టిన రీజనల్ సినిమా
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి ఏజెన్సీలో గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందించి గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుదాం అనుకున్న ఓ యువతి ఆశ ఆవిరి అయింది.. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కేంద్రంలో ఉన్న గాంధీనగర్ కు చెందిన ఎం.నాగజ్యోతి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహంచిన మెగా డీఎస్సీలో మంచి మార్కులు సాధించింది.. 74.40 మార్కులు రాబట్టింది.. మంచి మార్కులతో టీచర్ ఉద్యోగానికి అర్హురాలు అయినప్పటికీ.. క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె.. విశాఖలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందింది… దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి… కొద్ది రోజుల క్రితం ఆనారోగ్యంతో తండ్రి మృతి చెందగా.. టీచర్ ఉద్యోగంతో… తన కుటుంబానికి అండగా నిలుద్దాం అనుకున్న నాగజ్యోతి మృతి.. వారిని మరింత కుంగుబాటుకు గురిచేసింది.. అయితే, కొన్ని రోజులుగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నాగజ్యోతి.. డీఎస్పీలో అర్హత సాధించింది.. తీరా, ఫిజికల్‌గా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాల్సిన సమయంలో మృతిచెందింది..
తాజావార్తలు
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!