Araku Utsav 2026: అరకు ఉత్సవ్ – 2026.. ఆదివాసీ ఫ్యాషన్ షోలో మెరిసిన కలెక్టర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Araku Utsav 2026: ప్రకృతి అందాల నడుమ నిర్వహిస్తున్న అరకు ఉత్సవ్–2026 చివరి రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఐఏఎస్ అధికారులు స్వయంగా పాల్గొని అందరి మనసులు దోచుకున్నారు.
Read Also: Pinarayi Vijayan: కేంద్రానికి కేరళ సీఎం లేఖ.. వ్యాపారి సీజే.రాయ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
ఫ్యాషన్ షోలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న ఈ జంట ఎవరో తెలుసా..?
వీరు మరెవరో కాదు.. భార్యాభర్తలైన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్.. అరకు ఉత్సవ్ చివరి రోజున స్థానిక గిరిజన బాలికలతో కలిసి ప్రత్యేకంగా ఆదివాసీ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, కలెక్టర్ విజయ్ కృష్ణన్ సంప్రదాయ గిరిజన వేషధారణలో ర్యాంప్‌పై నడిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు పాడేరు ఐటీడీఏ పీవో తిరువనిశ్రీ పూజ.. అల్లూరి అసిస్టెంట్ కలెక్టర్, టీడీపీ నాయకులు గిడ్డి ఈశ్వరి, దొన్నుదొర.. కూడా ఫ్యాషన్ షోలో పాల్గొని కార్యక్రమానికి మరింత వన్నె తీసుకొచ్చారు.
సాధారణంగా తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండే ఐఏఎస్ అధికారులు ఇలా ఆడిపాడుతూ ప్రజలతో మమేకమవడం చూసి, కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల భాగస్వామ్యం వల్ల ఫ్యాషన్ షో మరింత ప్రత్యేకంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇలా ఆటవిడుపుగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారులు పాల్గొంటే వారి పనితీరు మరింత ఉత్సాహంగా ఉంటుందని, ప్రజలతో అనుబంధం కూడా బలపడుతుందని స్థానికులు వ్యాఖ్యానించారు. మొత్తానికి అరకు ఉత్సవ్–2026లో ఈ ఫ్యాషన్ షో ఒక గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచింది.
తాజావార్తలు
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు