Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Specific Carbohydrate Diet for Gut Health: గట్ హెల్త్ (పేగుల ఆరోగ్యం)పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఆహార విధానాలపై ఆసక్తి కూడా పెరుగుతోంది. అలాంటి వాటిలో స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ డైట్ (SCD) ఒకటి. జీర్ణకోశ సమస్యలను తగ్గించి, పేగుల వాపును నియంత్రించేందుకు ఈ డైట్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది అందరికీ సరిపోయే పరిష్కారం కాదని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు స్పష్టం చేశారు.
స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ డైట్‌ను మొదట డాక్టర్ సిడ్నీ హాస్ అభివృద్ధి చేయగా, తర్వాత బయోకెమిస్ట్ ఎలైన్ గాట్షాల్ దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ డైట్లో జీర్ణం కావడానికి కష్టమైన సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను పూర్తిగా తగ్గిస్తారు. ధాన్యాలు, ఎక్కువశాతం పాల ఉత్పత్తులు, బంగాళాదుంపలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, శుద్ధి చేసిన చక్కెరలను ఆహారంలో నుంచి తొలగిస్తారు. బదులుగా కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం, గుడ్లు, నట్స్, తేనె వంటి ఆహారాలను తీసుకోవాలని సూచిస్తారు.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ఈ డైట్ వెనుక ఉన్న ప్రధాన భావన ఏమిటంటే.. సరిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్లు పేగుల్లో పులియబడి హానికర బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. కార్బోహైడ్రేట్లను నియంత్రించడం ద్వారా గట్ బ్యాక్టీరియా సమతుల్యతను మెరుగుపరచి, పేగుల ఆరోగ్యాన్ని పునరుద్ధరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
వైద్యుల ప్రకారం.. క్రోన్స్ వ్యాధి, స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ (SIBO), సెలియాక్ వ్యాధి, డయేరియా ప్రాధాన్యమైన IBS (IBS-D) వంటి సమస్యలతో బాధపడుతున్న కొంతమందిలో ఈ డైట్ మంచి ఫలితాలు ఇచ్చింది. కొందరిలో రెండు నుంచి నాలుగు వారాల్లోనే ఉబ్బరం, గ్యాస్, కడుపు అసౌకర్యం, విరేచనాలు వంటి లక్షణాలు తగ్గినట్లు గుర్తించారు. అయితే, ఈ డైట్‌ను అనుసరించడం అంత సులభం కాదు. ఇది చాలా పరిమితులు కలిగిన ఆహార విధానం కావడంతో సరైన మార్గదర్శకత్వం లేకుండా పాటిస్తే కాల్షియం, బీ-విటమిన్లు, ఫైబర్ వంటి కీలక పోషకాల లోపం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఇది ఆటోఇమ్యూన్ వ్యాధులకు శాశ్వత చికిత్స కాదని, వైద్యులు సూచించిన మందులకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు, దీర్ఘకాలం పాటు ఆహార వైవిధ్యాన్ని తగ్గించడం వల్ల గట్ మైక్రోబయోమ్లోని మంచి బ్యాక్టీరియా వైవిధ్యం కూడా తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ డైట్‌ను ఎక్కువకాలం కొనసాగించే వారు వైద్యులు, డైటీషియన్ పర్యవేక్షణలో ఉండటం అవసరం. వైద్యుల సలహా ప్రకారం, ఈ డైట్‌ను ప్రయత్నించాలనుకునే వారు సుమారు మూడు నెలల పాటు నిపుణుల పర్యవేక్షణలో పాటించడం మంచిది. అదే సమయంలో ఒత్తిడి నియంత్రణ, సరైన జీవనశైలి, వైద్యులు సూచించిన చికిత్సను కొనసాగించడం కూడా అవసరం. గట్ సమస్యలకు ఒకే ఒక్క డైట్ పరిష్కారం కాదని, స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ డైట్ అనేది అందుబాటులో ఉన్న అనేక ఎంపికల్లో ఒకటేనని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!