Atmakur Bypoll: ఆత్మకూరులో రేపు పోలింగ్.. భారీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 279 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1132 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 148 మంది మైక్రో అబ్జర్వర్ల నియామకం చేశారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశారు. నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు. భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. మూడు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలు భద్రతలో వున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరుకి ఉప ఎన్నిక అనివార్యం అయింది. వైసీపీ, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. టీడీపీ గత సంప్రదాయాలను అనుసరించి పోటీ చేయడం లేదు. 2019లో ఆత్మకూరులో 83.38 శాతం మేర పోలింగ్ జరిగింది. ఉప ఎన్నిక కాబట్టి ఎంత పోలింగ్ జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో వున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు వుండగా, మొత్తం రెండు లక్షల 13 వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా వుండడం విశేషం, మహిళా ఓటర్లు లక్షా 7 వేల 367 మంది ఉంటే పురుష ఓటర్లు లక్షా 05 వేల 960 మంది ఉన్నారు. ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు సాయంత్రానికల్లా చేరుకుని సామాగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత అమలులో వుంది.
Also Read
- Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
- Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
ఎన్నికల నియమావళి పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్నారు ఈసీ అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఓటర్లు అంతా ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. అక్రమాలపై సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. అధికారిక వైసీపీ తన అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో వున్నారు. బీజేపీ తరఫున భరత్ కుమార్ పోటీలో వున్నారు. ఈ ఉప ఎన్నికలో లక్షకు పైగా మెజార్టీ సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుది. ఉప ఎన్నిక బాధ్యతను సైతం మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నానికి అప్పచెప్పారు అధినేత జగన్.. మరోవైపు బీజేపీ సైతం ఈ ఎన్నిక ఫలితం పై భారీగానే ఆశలు పెట్టుకుంది. తమకు మంచి ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు సైతం భారీగా ప్రచారం నిర్వహించారు.
Ruchira Kamboj:యూఎన్వో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
తాజావార్తలు
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!