FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచకప్ అనేది ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. అది కోట్లాది మంది అభిమానుల ఎమోషన్ కూడా. ఇప్పటికే మొదలైన ఈ ప్రపంచకప్ పోటీలో ఆయా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఫుట్‌బాల్ ట్రోఫీతో పాటు మరో అంశం కూడా అంతే పెద్ద చర్చకు దారితీస్తోంది. అదే స్టార్ ఆటగాళ్ల సంపాదన. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఫుట్‌బాల్ దిగ్గజాలు మైదానంలో గోల్స్ కొట్టడమే కాదు, బ్రాండ్ విలువ, ప్రకటనలు, క్లబ్ ఒప్పందాల ద్వారా కూడా అపారమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇప్పుడు 2026 ఫీఫా ప్రపంచకప్ ఎంత జోరుగా కొనసాగుతుందో, అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ ఆటగాళ్ల జాబితా కూడా అంతే చర్చనీయాంశంగా మారింది.
2026 ఫీఫా ప్రపంచకప్ అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈసారి తొలిసారిగా 48 జట్లు ఈ మెగా టోర్నమెంట్లో బరిలోకి దిగుతున్నాయి. ఇదే సమయంలో మాషబుల్ ఇండియా విడుదల చేసిన ఒక నివేదిక అత్యధిక ఆదాయం పొందుతున్న ఫుట్‌బాల్ ఆటగాళ్ల వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో ఎప్పటిలాగే పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలవడం విశేషం.
Also Read
- Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
- Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
నివేదిక ప్రకారం క్రిస్టియానో రొనాల్డో వార్షిక ఆదాయం సుమారు 300 మిలియన్ అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.2,836 కోట్లకు సమానం. 41 ఏళ్ల వయస్సులో కూడా ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా కొనసాగుతున్న రొనాల్డో, తన అద్భుత కెరీర్లో ఇంకా అందని ప్రపంచకప్ ట్రోఫీని సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. అందుకే ఈ ప్రపంచకప్ ఆయన కెరీర్లో అత్యంత భావోద్వేగభరితమైన టోర్నమెంట్‌గా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
రొనాల్డో తర్వాత రెండో స్థానంలో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ నిలిచాడు. ఆయన వార్షిక ఆదాయం సుమారు 140 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.1,323 కోట్లు. ఇప్పటికే ప్రపంచకప్‌ను గెలుచుకున్న మెస్సీకి ఇది మరో కీలక టోర్నమెంట్ కానుంది. మూడో స్థానంలో ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపే నిలిచాడు. అతని వార్షిక ఆదాయం సుమారు 95 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.898 కోట్లు. ఇప్పటికే ప్రపంచ ఫుట్‌బాల్‌కు భవిష్యత్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఎంబాపేపై ఈసారి కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ జాబితాలో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ సుమారు 80 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. బ్రెజిల్ యువ సంచలనం వినిసియస్ జూనియర్ 60 మిలియన్ డాలర్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈజిప్ట్ స్టార్ మహ్మద్ సలాహ్ 55 మిలియన్ డాలర్లు, సెనెగల్ స్టార్ సాడియో మానే 54 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో టాప్ సంపాదన కలిగిన ఆటగాళ్లలో చోటు దక్కించుకున్నారు.
2026 ప్రపంచకప్ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఫుట్‌బాల్‌లో రెండు తరాల సూపర్స్టార్లను ఒకే వేదికపై నిలబెట్టబోతోంది. ఒకవైపు రొనాల్డో, మెస్సీ వంటి దిగ్గజాలు చివరిసారిగా ప్రపంచకప్‌లో కనిపిస్తుండగా, మరోవైపు ఎంబాపే, హాలాండ్, జూడ్ బెల్లింగ్‌హామ్, లామిన్ యమాల్ వంటి యువ ప్రతిభావంతులు ప్రపంచ ఫుట్‌బాల్‌కు కొత్త దిశను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మైదానంలో ఎవరు విజేతగా నిలుస్తారన్న ఆసక్తితో పాటు, ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విలువైన స్టార్ ఎవరు అన్న చర్చ కూడా అంతే ఉత్కంఠగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!