8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR X70 Pro Max Launched: హానర్ (HONOR) నుండి కొత్త HONOR X70 Pro Max స్మార్ట్‌ఫోన్ ను నిశ్శబ్దంగా లాంచ్ చేసింది. బలమైన నిర్మాణం, భారీ బ్యాటరీ, అత్యాధునిక డిస్ప్లే, AI ఫీచర్లతో వంటి ఆడుబితా ఫీచర్స్ తో ఈ ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. చైనీస్ సాంప్రదాయ స్ఫూర్తితో రూపొందించిన డిజైన్‌తో పాటు దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్ ను సిద్ధం చేసినట్లు కామపీనీ తెలిపింది.
కలర్ ఫుల్ డిజైన్:
HONOR X70 Pro Max కంపెనీ ప్రత్యేకమైన స్టార్-రింగ్ కెమెరా డిజైన్‌ను కొనసాగిస్తోంది. ఈ ఫోన్ ఫాంటమ్ నైట్ బ్లాక్, బాంబూ రైమ్ గ్రీన్, సన్‌రైజ్ గోల్డ్, ఫాంటమ్ పర్పుల్ అనే రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. స్లిమ్ డిజైన్‌తో పాటు ప్రీమియం లుక్‌ను ఈ మొబైల్ డిజైన్ కలిగి ఉంది.
Also Read
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
2.5 మీటర్ల డ్రాప్ రెసిస్టెన్స్:
ఈ ఫోన్ SGS గోల్డ్ లేబిల్ 10-సైడెడ్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను పొందింది. 2.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునే సామర్థ్యం ఉందని కంపెనీ పేర్కొంది. అలాగే IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో ధూళి, నీరు, అధిక పీడన నీటి జెట్ల నుంచి రక్షణ పొందుతుంది.
1.5K OLED డిస్ప్లే:
HONOR X70 Pro Maxలో 6.79 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్ప్లేను అందించారు. ఇది 2640×1200 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 100% DCI-P3 కలర్ గామట్‌తో అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. గరిష్టంగా 6000 నిట్స్ బ్రైట్నెస్ను అందించే ఈ డిస్ప్లే 3840Hz PWM డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తుంది. హానర్ “ఒయాసిస్ ఐ ప్రొటెక్షన్” టెక్నాలజీ ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. AI డీఫోకస్ కంటి రక్షణ, సహజ కాంతి అనుకరణ, AI నిద్ర సహాయక డిస్ప్లే, తక్కువ నీలి కాంతి, అల్ట్రా డార్క్ మోడ్ వంటి ఫీచర్లు కంటి ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడతాయి.
8560mAh భారీ బ్యాటరీ:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qinghai లేక్ సిలికాన్-కార్బన్ 8560mAh బ్యాటరీని అమర్చారు. కంపెనీ ప్రకారం ఈ బ్యాటరీ ఆరు సంవత్సరాల పాటు ఆరోగ్యకరమైన పనితీరును కొనసాగించేలా రూపొందించబడింది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. 15 గంటల వరకు వీడియో కాలింగ్, 14 గంటల పాటు నిరంతర గేమింగ్, 27 గంటల వరకు షార్ట్ వీడియోల వీక్షణ సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసేందుకు 90W సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. దీంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవచ్చు.

ప్రాసెసర్:
HONOR X70 Pro Maxలో Snapdragon 6 Gen 4 4nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. Adreno 810 GPUతో కూడిన ఈ చిప్సెట్ బెస్ట్ పనితీరు, శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. AI ఆధారిత రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఆరు సంవత్సరాల పాటు ల్యాగ్ లేకుండా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంకా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10పై పనిచేస్తుంది. వేగవంతమైన టచ్ రెస్పాన్స్, స్మూత్ యానిమేషన్లు, మెరుగైన రిసోర్స్ మేనేజ్మెంట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
AI ఫోటోగ్రఫీ:
ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రధాన కెమెరాను అందించారు. EIS సపోర్ట్‌తో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరాలో AI పేస్ రెస్టోరేషన్, AI రిఫ్లెక్షన్ రిమూవల్, AI బ్యాక్ గ్రౌండ్ రిమూవల్, AI స్టయిలిజషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి ఫోటోలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సహాయపడతాయి.
ధరలు:
HONOR X70 Pro Max ప్రస్తుతం చైనాలో అమ్మకలకు అందుబాటులో ఉంది. 8GB + 256GB వేరియంట్ ధర 1,999 యువాన్ (రూ. 28,000), 8GB + 512GB వేరియంట్ ధర 2,399 యువాన్ (రూ. 33,600) గా నిర్ణయించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!