Anakapalli: అనకాపల్లి జిల్లా లోని కసింకోట మండలం లోని నరసింగబిల్లి లోని నరసీంగబిల్లి కోపరేటివ్ సొసైటీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నైట్ వాచ్మెన్ ను తాళ్లతో బంధించారు. అనంతరం ముగ్గురు దుండగులు కలిసి బ్యాంకు తలుపులు, తాళాలు పగలగొట్టి బ్యాంకు లోకి ప్రవేశించారు. అంతటితో ఆగలేదు దుండగులు స్ట్రాంగ్ రూమ్ గోడకు కన్నం పెట్టి లోనికి ప్రవేశించారు. అలానే దుండగులు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా ముందస్తు జాగ్రతగా బ్యాంకు లోని సీసీ కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేసారు. కాగా రాత్రి బ్యాంకు లో దొంగలు పడిన విషయం మరుసటి రోజు ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం బ్యాంకును పరీశీలించిన పోలీసులు క్లూస్ టీం తో బ్యాంకులో ఆధారాలు సేకరిస్తున్నారు.
Read also:Laughing Gas: ‘లాఫింగ్ గ్యాస్’పై యూకే నిషేధం.. కారణమిదే..
కాగా గతంలో కూడా ఇదే నర్సింగపల్లి గ్రామంలో గల గ్రామీణ వికాస్ బ్యాంకు లోనూ పట్టపగలు దుండగుడు చొరబడ్డారు. అనంతరం గన్ తో బెదిరించి 15 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మరువకముందే మరో బ్యాంక్ చోరీ విపలయత్నం జరగడంతో పోలీసులు ఖంగుతిన్నారు. వరుస దొంగతనాలకు దుండగలు పాల్పడుతుండడంతో ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను గుర్తించేందుకు ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏం అయినా ఆధారాలు దొరికాయ లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.