ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున కన్నుముసారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేసారు. చిరంజీవి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్, ఆర్ నారాయణ మూర్తి, రాజీవ్ కనకాల, వందేమాతరం శ్రీనివాస్, తమ్మరెడ్డి భరద్వాజ, నిర్మాత బండ్ల గణేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, నిర్మాత అచ్చిరెడ్డి, శివాజీ రాజా, రావు రమేష్, సీనియర్ నటులు మురళి మోహన్ తదితరులు కోట భౌతిక కాయానికి నివాళులర్పించారు.
Also Read : Tollywood : బరువు తగ్గుతున్న ఇద్దరు స్టార్ హీరోలు
అలాగే ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటులు పవన్ కళ్యాణ్ కోట భౌతిక కాయానికి నివాళులర్పించి ‘ఆయన మరణ వార్త విని బాధ కలిగింది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహన్మాటంగా చెప్పేస్తారు. అత్తారింటికి దారేది సినిమాలో ఆయనతో కలిసి నటించాను. ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని అడిగితే చనిపోయేంతవరకు నటిస్తారని చెప్పారు. ఆయన మాటలు నన్ను కదిరించాయి. బాబు మోహన్ తో కలిసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఆయన నటించారు. వారి ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుండేది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల గొప్ప నటులు కోట శ్రీనివాసరావు గారు. ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు. పవన్ తో పాటు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోట భౌతిక కాయానికి నివాళులర్పించారు.