పేలుడు పదార్థాలతో ఇరువురు మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో పుంగ్ గుట్ట శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు, శబరి ఏరియా ల మిలిషియా కమాండర్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ముచ్చిక బుద్ర అలియాస్ సంతోష్..సంతు , కొవ్వా సి. మణికుమార్ లుగా గుర్తించారు. ఈ సందర్భంగా చింతూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఓఎస్డి కృష్ణకాంత్ మీడియాతో మాట్లాడారు.
మావోయిస్టు కార్యకలాపాలు అరికట్టడంలో భాగంగా స్టేట్ స్పెషల్ పోలీస్ పార్టీ మరియు సీఆర్పీఎఫ్ సిబ్బంది ముందస్తు సమాచారం మేరకు పొంగుట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా అనుమానితులుగా అడవిలో తిరుగుతూ మందుపాతరలు అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొవ్వా సి మణికుమార్. ముచిక బుద్ధ అనే ఇరువురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి సంచిలో 12 డిటోనేటర్ లు. కార్డ్ ఎక్స్ వైర్. కొన్ని ఇనుప ముక్కలు. ఒక ప్రెజర్ కుక్కర్ లభించాయని తెలిపారు.
అనంతరం వీరిని విచారించగా ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన చింతూరు మండలం సర్వేల గ్రామ శివారు జాతీయ రహదారి 30 పై కె.వి.ఆర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కు నిప్పంటించిన ఘటనలో పాల్గొనారని, ఎటపాక మండలం చెరువు గుంపు గ్రామానికి చెందిన మడివి రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రంలోని మైసా గ్రామం వద్ద 2021 సంవత్సరంలో గొంతు కోసి హత్య చేశారని తేలిందన్నారు. అలాగే ఆగస్టు 29వ తేదీన కుర్నవల్లి శివారులో కడప రాము అనే వ్యక్తిని హత్య చేశారని. మే 15వ తేదీన చెన్నాపురం పోలీస్ క్యాంప్ పై జరిగిన దాడి ఘటనలో వీరు పాత్రపోషించారని తెలిపారు.
Read ALso: Kidnap Woman: కిడ్నాప్ చేయడంలో ఆరితేరిన మహిళ.. అప్పుడు తప్పించుకుంది.. ఇప్పుడు దొరికింది
అక్టోబర్ 20, 2021 సంవత్సరంలో చింతూరు మండలం మల్లం పేట గ్రామ శివారులో పోలీస్ పార్టీలను చంపాలని ఉద్దేశంతో మందుపాతర పెట్టిన సంఘటనలో ప్రధాన సూత్రధారి అని తెలిపారు. కొవ్వాసి మణికుమార్ అనే మావోయిస్టు ఎటపాక మండలం దొరగుంట గ్రామానికి చెందిన వాడని ఇప్పుడిప్పుడే మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడై ఈ మధ్యనే మిలీషియా సభ్యులుగా చేరటం జరిగిందన్నారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతి లోకి రావాలని అలాంటి వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందుతాయని ఆయన తెలిపారు.
Read Also: Arohi Rao: స్ట్రాంగ్ కౌంటర్.. తమ్మీ, నువ్వు అడుక్కున్నా దొరకదు