గుడివాడ క్యాసినో ఎపిసోడ్ కంటిన్యూస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుడివాడ క్యాసినో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవటంతో విషయం మరింత వేడెక్కింది. మంత్రి కొడాలి నాని, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇంకోవైపు కోడాలి నానిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మధ్యలో రాంగోపాల్ వర్మ వంటివారు సెటైర్స్ వేస్తున్నారు. మొత్తానికి ఇప్పడు ఏపీ రాజకీయాలు గుడివాడ క్యాసినోవా చుట్టే తిరుగుతున్నాయి. ఉద్యోగుల ఆందోళన కూడా పక్కకు పోయిందనిపిస్తోంది.
మంత్రి కొడాలి నాని తాజా ప్రెస్‌మీట్‌లో తనపై వచ్చిన ఆరోపణలను మరోసారి తిప్పికొట్టారు. తన కన్వెనషన్ సెంటర్లో క్యాసినో నిర్వహిస్తున్నారని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాంతో, టీడీపీ నేతల నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్స్ వస్తున్నాయి.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
సంక్రాంతి ముసుగులో కొడాలి నాని క్యాసినో నిర్వహించారని ఆరోపిస్తూ కాసినోకు దృశ్యాలు బయటకు రాగానే ఆయనపై కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కొడాలి నాని, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక టీడీపీ సభ్యులు కృష్ణా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. దాంతో ఇరు వర్గాలు మాటల యుద్ధానికి దిగడంతో వివాదం రచ్చకెక్కింది. గత వారం, టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు గుడివాడలో కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లాలని ప్రయత్నించినప్పుడు కొడాలి నాని మద్దతుదారులు వారిపై దాడికి పాల్పడ్డారు.
మంత్రి నాని తనపై వచ్చిన ఆరోపణలను పదే పదే ఖండిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు మీడియాలోని ఒక వర్గం తనను ఇందులోకి లాగిందని మంత్రి ఆరోపించారు. టీడీపీ తమ ఆరోపణలకు ఆధారాలు ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా అన్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విలేకరుల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారుల మద్దతుతో జూదగృహం నిర్వహిస్తున్నందునే నానిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇంటి గేటును టచ్ చేసినా నానిని చంపేస్తానని కూడా బుద్దా బెదిరించాడు. డిజిపి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బుద్దా ఆరోపించారు. క్యాసినోలో రూ.200-300 కోట్లు చేతులు మారాయని… సీఎం వైఎస్ జగన్‌కు, పోలీసులకు అందులో వాటా ఉందని అరోపించారు. అందుకే నానిని అరెస్ట్ చేయలేదన్నారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి బెయిల్‌పై విడుదలచేశారు.
క్యాసినో ఆరోపణలపై కృష్ణా జిల్లా పోలీసులు జనవరి 20 న విచారణకు ఆదేశించారు. విజువల్స్‌లో ఒక వ్యక్తి టేబుల్‌పై కార్డులు డీల్ చేస్తూ కనిపిస్తుండగా, సింగర్స్ పాడుతుండగా జనం డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ హాల్‌లో సంక్రాంతి సంబరాల్లో వందల కోట్ల రూపాయల నగదు మార్పిడి జరిగిందని టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు.
క్యాసినో గుడివాడలో జరిగిందనటానికి టీడీపీ కొన్నా ఆధారాలు చూపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా విజయవాడ దగ్గర కాసినో నిర్వహిస్తున్నట్టు ఏసెస్ అనే కాసినో సంస్థ తన ఇన్‌స్టాలో ప్రకటించింది. ఆ పోస్టులో లొకేషన్ అనే చోట గుడివాడ అని చూపిస్తోంది.
గుడివాడ వచ్చి కాసినోలో పాల్గొన్న అమ్మాయిల వివరాలు అంటూ టీడీపీ ఒక లిస్టు విడుదల చేసింది. అందులో టికెట్లు బుక్ చేసిన ఎయిర్ లైన్స్ నంబర్లు, వారు విజయవాడ, బెంగళూరు మీదుగా గోవా వెళ్లిన విమానం వివరాలు, వారి పేర్లను వర్ల రామయ్య మీడియాకు విడుదల చేశారు. దాంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.
క్యాసినో నడుపుతున్నారనే ఆరోపణలు రాగానే నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులును దానిపై విచారణకు ఆదేశించారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా క్యాసినో ను నిషేధించారు. ఈ కేసు విచారణలో ఏం జరుగుతుందో…ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!