Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘రామాయణ’ చిత్రం నవంబర్ 5న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ సందడి చేస్తోంది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి వంటి అగ్ర తారలు నటించిన ఈ సినిమాలో అందరి దృష్టి రాముడు, రావణుడి పాత్రలపైనే ఉంటుందని అంతా భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు. ఆయనే ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌తో ‘ప్రహ్లాద్ చాచా’గా ఇంటింటా పాపులర్ అయిన నటుడు ఫైసల్ మాలిక్. ‘రామాయణం’లో కుంభకర్ణుడిగా నటించిన ఫైసల్ మాలిక్, ఏకంగా తన ఆన్‌స్క్రీన్ అన్నయ్య, పాన్ ఇండియా స్టార్ యష్నే వెనక్కి నెట్టి IMDb వారపు ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
రావణుడిగా అదరగొట్టిన యష్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడం విశేషం. ఓటీటీలో ఎంతో సహజమైన నటనతో మెప్పించిన ఫైసల్, ఇప్పుడు వెండితెరపై తన విశ్వరూపం చూపిస్తూ స్టార్ హీరోలకే గట్టి పోటీ ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఫైసల్ మాలిక్ హవానే నడుస్తోంది. ముఖ్యంగా సినిమాలో ఆయన ఎంట్రీ సీన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. గతంలో ‘పంచాయత్’ సిరీస్ సమయంలోనూ ఆయనపై మీమ్స్, రీల్స్ వైరల్ అయ్యాయి. కానీ ఈసారి పరిస్థితి వేరు. ప్రేక్షకులు ఏకంగా థియేటర్లలోనే ఆయన ఎంట్రీ సీన్‌ను రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. లక్షల వ్యూస్‌తో ఆ వీడియోలు వైరల్ అవుతుండటం, అభిమానులు తనను ట్యాగ్ చేస్తూ చూపిస్తున్న ప్రేమ చూసి ఫైసల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
Also Read
కుంభకర్ణుడి వంటి భారీ పాత్రలో ఒదిగిపోవడం అంత సులభం కాలేదని ఫైసల్ మాలిక్ చెబుతున్నారు. ఇది పూర్తిగా వీఎఫ్ఎక్స్ (VFX) ఆధారిత చిత్రం కావడంతో, ఇప్పటివరకు తాను నేర్చుకున్న సాధారణ నటన పద్ధతులను పక్కన పెట్టాల్సి వచ్చిందని ఆయన వివరించారు. దీనికోసం చిత్ర బృందం తమకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిందని, అది లేకపోతే ఈ పాత్రకు న్యాయం చేయడం కష్టమయ్యేదని పేర్కొన్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో రావణుడితో (యష్) వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. కుంభకర్ణుడి చేతిపై రావణుడు నడుస్తూ అతన్ని ఆశీర్వదించే సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా, కంటి కదలికలు, హావభావాలపై ప్రత్యేక దృష్టి పెట్టి విడివిడిగా చిత్రీకరించారట. ఇప్పటివరకు ‘అవతార్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి హాలీవుడ్ సినిమాల మేకింగ్ వీడియోలు మాత్రమే చూసిన తాము, ఇప్పుడు స్వయంగా అలాంటి అద్భుతమైన ప్రక్రియలో భాగం కావడం జీవితంలో మర్చిపోలేని అనుభవమని ఫైసల్ ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ సినిమా చరిత్రలో ఇంతటి భారీ స్థాయి చిత్రం మళ్లీ రాదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, రవి దూబే, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, తనదైన నటనతో ‘కుంభకర్ణుడు’ ఫైసల్ మాలిక్ ఇలా IMDb టాప్‌లో నిలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
-
UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు