UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు మొదలయ్యాయి. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీల నేతలు సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున యూపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్, పీసీసీ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ తదితరులు పాల్గొంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంలాల్ పాల్, ఎంపీలు రాజీవ్ రాయ్, ఇక్ఱా హసన్ చర్చల్లో పాల్గొంటున్నారు. సీట్ల కేటాయింపుపై తుది నిర్ణయం మాత్రం పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీసుకోనున్నారు.
Also Read
- Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
- Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
- WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
- Tirumala Vaikunta Dwara Darshan 2026: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వీటిలో సుమారు 350 స్థానాల్లో పోటీ చేయాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. గెలుపు అవకాశాల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరగాలని అఖిలేష్ యాదవ్ పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కోరుతున్నప్పటికీ, గెలుపు అవకాశాలను బట్టి పరిమిత సంఖ్యలో సీట్లు కేటాయించాలనేది ఎస్పీ ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తమకు బలమైన నియోజకవర్గాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న సుమారు 60 అసెంబ్లీ స్థానాలను కచ్చితంగా దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్న నియోజకవర్గాలు, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. దళిత, ముస్లిం, బ్రాహ్మణ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను కూడా తమకు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గత 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. మొత్తం 80 స్థానాలకు గాను సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేసి 37 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలను గెలుచుకుంది. ఈ ఫలితాలను ప్రస్తుత సీట్ల సర్దుబాటు చర్చల్లో ఇరు పార్టీలు ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోనూ సీట్ల సర్దుబాటుపై కసరత్తు జరగనుంది. రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD), అప్నా దళ్ (S), నిషాద్ పార్టీ, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) వంటి భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
-
Record: సుకుమార్ క్యాంప్‌లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు