సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్మీషియా మైనర్ యువతి సామూహిక అత్యాచారం మరువక ముందే మరో స్టార్ హోటల్ లో ఓ యువతిపై యువకులు దాడి చేసి, రేప్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ కోసం పని చేస్తున్న బాధిత యువతి ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని రూఫ్ టాప్ పబ్ లాంజ్ కు వెళ్ళింది. కాసేపు సరదాగా గడిపింది. దీంతో అక్కడ వున్న 8మంది యువకుల…
పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. అబ్బాయిని చూడమని బంధువులు, సన్నిహితులకు చెబుతుంటారు. అయితే ఝార్ఖండ్ హజారీబాగ్‌కు చెందిన ఓ యువతి మాత్రం తన సంబంధం తానే చూసుకుంటోంది. తనకు ఎలాంటి వరుడు కావాలో చెబుతూ ఓ యువతి ఇచ్చిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని జెండా చౌక్ సమీపంలో నివసించే బంగాలీ దుర్గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, తనకు తగ్గ వరుడిని తానే వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. ఇందులో…
మనిషి హాయిగా బ్రతకాలంటే ఏదైనా ఉపాధి కావాలి. అందుకే సొంతంగా వ్యాపారం కొందరు చేస్తుంటే..! మరి కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రస్తుత సమాజంలో పురుషులకు పోటీగా మహిళలు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ రంగంలోనూ మహిళలు మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఐతే మహిళలు ఎక్కడ పనిచేస్తూన్నా వారికి వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న యువతిని వేధించిన యువకుడికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. బాధితురాలి…
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. కీసర బ్రిడ్జి పై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా యువతి. ద్విచక్ర వాహనంపై వచ్చి బ్రిడ్జి పైన వాహనాన్ని నిలిపింది. అనంతరం నది నీటిలోకి దూకింది యువతి. ఈ విషయం గమనించి రక్షించారు స్థానిక యువకులు. అనంతరం 108 వాహనంలో నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి వుంది. స్థానికులు సకాలంలో స్పందించడంతో…