ఓ మహిళ తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు మంత్రగత్తెను ఏర్పాటు చేసుకుంది. మంత్ర గత్తె చేసే మాయా జాలంతో తన ప్రియుడి వేధించాలనుకుంది. అతడికి నరకం చూపించి.. గుణపాఠం నేర్పించాలనుకుంది.
Read Also: Blue Egg: పార్క్ లో ఓ జంటకు దొరికిన నీలి రంగు గుడ్డు.. దాన్ని వాళ్లు ఏం చేశారంటే..
ఆమె తన గురించి ,తన ప్రియుడి గురించి కొన్ని వ్యక్తిగత వివరాలను ఆమెకు చెప్పింది. ఆ మహిళ @talulah.roseb అనే యూజర్‌నేమ్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో యాక్టివ్‌గా ఉంది. ఆమె పేరు తల్లులా రోజ్. ఆమె తన కథను సోషల్ మీడియాలో పంచుకుంది మరియు తన ప్రణాళిక ఎలా విఫలమైందో వివరించింది. తాను డేటింగ్ చేస్తున్న వ్యక్తి పట్ల తీవ్ర నిరాశకు గురయ్యానని రోజ్ తెలిపింది. దీంతో మా మధ్య దూరం ఏర్పడిందని వెల్లడించింది. మంత్రగత్తెకి డబ్బు కూడా ఇచ్చి, వారి మధ్య జరిగినదంతా చెప్పింది. మంత్రగత్తె తన వైపు తీసుకుని తన మాజీ ప్రియుడికి గుణపాఠం చెబుతుందని ఆమె ఆశించింది.కానీ దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది.
Read Also: lip kiss :మరీ ఇంత కరువులో ఉన్నావేంట్రా.. వాళ్లతో కూడానా..
మంత్రగత్తె యువతితో ఈవిధంగా చెప్పుకొచ్చింది. తను మానసికంగా బాగాలేదని.. షాక్ థెరపీ అవసరమని యువతితో చెప్పింది. మంత్రాలు, తంత్రాలతో ఏదీ సాధ్యం కాదని ప్రేమతో.. ఏదైనా జయించవచ్చని మంత్ర గత్తె యువతికి తెలిపింది. “నువ్వు చాలా నిరాశలో ఉన్నావు, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఆ మనిషి అంత చెడ్డవాడిగా కనిపించడం లేదు. మంత్రగత్తె నీ డబ్బు తిరిగి ఇస్తాను.. నీకు చికిత్స అవసరం” అని చెప్పినట్లు యువతి పేర్కొంది.