ఏప్రిల్ 1న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2024లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. ముంబై రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాక పోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరోవైపు RR, రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానంలో ఉంది.
Also read: Rishabh Pant Batting: ఒంటి చేత్తో సిక్స్.. ఒకప్పటిలా రిషబ్ పంత్ బ్యాటింగ్!
ఇక ఇప్పటివరకు ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. మార్చి 27న జరిగిన రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR) మొదట మార్చి 24న జరిగిన తమ మొదటి మ్యాచ్ లో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG)ని 20 పరుగుల తేడాతో ఓడించింది. తర్వాత, మార్చి 28న ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ని 12 పరుగుల తేడాతో ఓడించింది.
Also read: Rashmi Gautham: పెళ్లి చేసుకోబోతున్నయాంకర్ రష్మీ.. అబ్బాయి ఎవరంటే?
ఇక ఇరుజట్లు ముంబై, రాజస్థాన్ లు ఇప్పటి వరకు 28 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా.. అందులో ముంబై 15, రాజస్థాన్ 12 గెలిచాయి. ఇద్దరి మధ్య ఒక మ్యాచ్ టైగా ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ పై ముంబై అత్యధిక స్కోరు 214, అలాగే ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ అత్యధిక స్కోరు 212. ఇక నేటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), నమన్ ధీర్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా, షమ్స్ ములానీ గా అంచనా వేయవోచు.
అలాగే రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI చూస్తే.. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (సి)/(వారం), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ లు ఉండొచ్చని అంచనా.