ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన కామిక్ క్యారెక్టర్లలో ఒకటి స్పైడర్ మ్యాన్. ఈ స్పైడర్ మ్యాన్ పాత్రను సృష్టించిన రచయితలు స్టాన్‌లీ, స్టీవ్ డిట్కోచేలు. వీరు కామిక్ పుస్తకాలు ఎన్నో రాశారు. అన్ని పుస్తకాల్లోనూ స్పైడర్ మ్యాన్ పుస్తకాలు వేరయా అనే విధంగా ఉంటాయి. 1984లో కామిక్ పుస్తకంలోని సింగిల్ స్పైడర్ మ్యాన్ పేజీ వేలంలో రికార్డ్ స్థాయలో రూ. 24 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. పుస్తకాలు, నవలులు భారీ స్థాయిలో వేలంలో అమ్ముడు పోవడం అందరికి తెలసిన విషయమే. కానీ, పుస్తకంలోని ఒక సింగిల్ పేజీ ఈస్థాయిలో వేలంలో అమ్ముడు పోవడం అన్నది విశేషం. స్పైడర్ మ్యాన్ పాత్రకు ప్రపంచంలో ఎలాంటి ప్రాముఖ్యత ఉన్నది అన్నది దీని ద్వారానే అర్థం అవుతున్నది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో విడుదలైన స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్ అనే సినిమా ప్రపంచం వ్యాప్తంగా డిసెంబర్ 21 వ తేదీన విడుదలయ్యి సంచలన విజయం సొంతం చేసుకుంది. రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది.
Read: రామ్ “RAPO19” టైటిల్ ఇదే !