మాస్ మహారాజా రవితేజ నటించిన కిక్ సినిమా అందరు చూసే ఉంటారు.. కిక్కు కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ సినిమాను చూసి ప్రేరణ పొందాడో ఏమో కానీ ఒక యువకుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడున్నర కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశావ్ అంటే బోర్ కొడుతోంది.. కిక్కులేదని చెప్పడం విశేషం.. ఇంతకీ ఎవరా మహానుభావుడు అని తెలుసుకోవాలని ఉందా.. సరే చూద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ ఎంత పెద్ద కంపెనీనో అందరికి తెలుసు.. అందులో ఉద్యోగం రావడం కోసం ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారు. ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్లో 2017 లో ఒక ఇంజనీర్ గా జాయిన్ అయ్యాడు మైఖెల్ లిన్.. అతడికి ఒక టీమ్ ని ఇచ్చి నెలకు మూడున్నర కోట్లు జీతం ఇస్తున్నారు. అంతేకాకుండా ఆ సంస్థలోనే అతడికి ఒక మంచి పేరు ఉంది.. కరోనా వచ్చాక ప్రజలందరూ ఓటీటీలకు అంకితమైపోయారన్న విషయం విదితమే.. దీంతో వీరికి పని పెరిగింది.. వేరే ఓటీటీలకు దీటుగా ఉండడం కోసం ఈ టీమ్ కొత్త కొత్త ప్లాన్స్ ను అమలుచేసింది. ఇంకేముంది అన్ని ఓటీటీల కంటే నెట్‌ఫ్లిక్స్ ముందు ఉంది. ఇక ఇలా సాగుతున్న క్రమంలో కరోనా లాక్ డౌన్ ముగిసింది.. అందరు ఆఫీస్ లకు వెళ్లడం మొదలుపెట్టారు.. అంతా నార్మల్ గా మారిపోయింది. దీంతో ఈ రొటీన్ లైఫ్ మైఖెల్ కు బోర్ కొట్టేసింది.. చూశాడు.. చూశాడు.. ఇక లాభం లేదు అనుకోని కోట్ల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసి బయటికి వచ్చేశాడు.
అయితే సడెన్ గా రాజీనామా చేస్తే వివరణ కోరుతూ అందరు తనను ప్రశ్నించడం మొదలు పెడతారని అందరికి మెయిల్ పంపాడు.. రాజీనామా చేయడానికి వేరే కారణాలు ఏమి లేవు.. పనిలో కిక్కు లేదు బోర్ కొట్టేసింది అని చెప్పుకొచ్చాడు. అతను చేసిన పనికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారట అతని కొలీగ్స్.. ఇక ఈ విషయం గురించి మైఖెల్ మాట్లాడుతూ.. రోజూ ఒకటే లిఫెను లీడ్ చేయడం చాలా కష్టం.. త్వరలోనే కొత్త టీమ్ తో అందరిని కలుస్తా.. రోజుకో ఛాలెంజ్ మును ఎదుర్కొంటా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఒక్క ఉద్యోగం లేక చస్తుంటే కిక్కు లేదని ఉద్యోగం మానేశాడా..? అంటూ నెటిజన్స్ నోళ్లు నొక్కుకుంటున్నారు.