చిరు వ్యాపారులు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే… వందో.. ఐదొందలో లాభం వస్తుంది. దాంతో కుటుంబాన్ని పోషించుకుంటారు. చిరు వ్యాపారులకు వచ్చే లాభం అంతంతా మాత్రమే. రోజంతా శ్రమ పడితే.. కొంచెం లాభమే వస్తుంది. అలాంటి చిరు వ్యాపారుల కష్టాన్ని దోచుకున్నారు దుర్మార్గులు. రోడ్డు పక్కన కోడి గుడ్ల వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి దగ్గర నుంచి ఎగ్స్ ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ
రోడ్డు పక్కన ఉన్న దుకాణం ముందు ఓ లగ్జరీ కారు వచ్చి ఆగింది. కారులోంచి వచ్చిన వ్యక్తి.. ఎక్కువ గుడ్లు కావాలని అడిగాడు. ఒకేసారి పెద్ద బేరం వచ్చిందని భావించి.. ఉన్న గుడ్లను రెండు భాగాలుగా ఎగ్స్ ట్రేలో కట్టిపెట్టి అందజేశాడు. వాటిని కారులో పెట్టుకున్న ఆ వ్యక్తులు.. క్యాష్ లేదు.. ఆన్‌లైన్ పేమెంట్ చేస్తామని చెబితే.. క్యూఆర్ కోడ్ తెచ్చాడు. అది పని చేయలేదు. అనంతరం మరో క్యూఆర్ కోడ్ తెచ్చేందుకు వెనక్కి రాగా.. వెంటనే కారును వేగంగా పోనిచ్చారు. ఈ పరిణామంతో వ్యాపారి షాక్ అయ్యాడు. తన లాభంతో పాటు పెట్టుబడి అంతా పోయిందని లబోదిబో అన్నాడు. వెంటనే తేరుకున్న ఆ వ్యక్తి.. సెల్‌ఫోన్ తీసుకుని ఎవరితోనో గోడువెళ్లబుచ్చుకున్నాడు. దాదాపు రూ.2,100 విలువ చేసే కోడి గుడ్లు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాపు ముందు ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లగ్జరీ కారులో వచ్చి ఇదేం దోపిడీ అంటూ దుమ్మెత్తిపోశారు.
ఇది కూడా చదవండి: UP News: న్యూ ఇయర్ రోజు ప్రేయసిని కలిసేందుకు వచ్చాడు.. ఆ తర్వాత దారుణం..
వీడియో వైరల్ కావడంతో పరువు పోతుందని భావించిన నిందితులు.. మరుసటి రోజు మళ్లీ షాపు దగ్గరకు వచ్చి గుడ్లు డబ్బులు ఇచ్చి వెళ్లారు. ఆన్‌లైన్ పేమెంట్ ఫెయిల్ అయ్యిందని.. అది గమనించే తిరిగి ఉదయం వచ్చామని దొంగలు కవరింగ్ ఇచ్చారు. మొత్తానికి తన డబ్బులు తనకు వచ్చాయంటూ చిరు వ్యాపారి సంతోషం వ్యక్తం చేశాడు. కానీ జరగాల్సిన నష్టమంతా అప్పటికే జరిగిపోయింది.
शर्मनाक! लाखों की गाड़ी में आए लेकिन अंडे के पैसे दिए बिना भागे
◆ ये घटना पंजाब की है जहां कार सवार एक परिवार ने 6 ट्रे अंडे लिए लेकिन पैसे नहीं दिए
◆ ये वीडियो सोशल मीडिया पर बेहद वायरल हो रही है #PunjabAndaChor | #ViralVideo | Punjab pic.twitter.com/XoVzJJYCmZ
— News24 (@news24tvchannel) January 7, 2025