ఒకప్పుడు పెళ్లంటే చాలా సింపుల్‌గా జరిగిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. డబ్బు పెరిగింది. ఆలోచన మారింది. ఒకరి కంటే గొప్పగా వేడుక చేసుకోవాలని తాపత్రయం పడుతున్నారు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. దీన్ని గ్రాండ్‌గా చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దీని పేరుతో కొత్త కొత్త ట్రెండ్‌లు సృష్టిస్తున్నారు.