యువత రోజు రోజుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి స్టంట్స్ చేసి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఓ యువకుడు రైల్వే బ్రిడ్జిపై వేలాడుతూ స్టంట్స్ చేస్తూ.. వీడీయో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Lover Suicide: ప్రేమ పెళ్లికి ఒప్పుకోని యువతి పేరెంట్స్.. యువకుడు సూసైడ్
అయితే.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఓ యువకుడు తన ప్రాణాలను లెక్కచేయకుండా రైల్వే బ్రిడ్జిపై వేలాడుతూ స్టంట్స్ చేశాడు. అంతటితో ఆగకుండా.. దాన్ని రీల్ గా క్రియేట్ చేసి.. ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశాడు. దీంతో వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి చర్యలు ఎప్పటికైనా నష్టాన్ని కలిగిస్తాయని.. కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Read Also:Health Benefits of Garlic: రోజు రెండు ఎల్లిపాయ రెబ్బలు తింటే.. ఏమవుతుందో తెలుసా..
రైల్వే ట్రాక్‌లు, వంతెనలు వంటి ప్రదేశాలలో ఎలాంటి స్టంట్ లు చేయకూడదు. ఎవరైనా అలా చేస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికి కొందరు అలానే స్టంట్స్, రీల్స్ చేస్తూ.. ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు.