టీఆర్ఎస్ ప్రభుత్వం పై విజయశాంతి ఫైర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని మాట్లాడడం పట్ల తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై అసహ్యించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ నుండి 5 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది .ఇంకా 12 ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేసుకోవడానికి నిధులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? ఆక్సిజన్ కొరత లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా? యుద్ధ విమానాలను రాష్ట్రానికి పంపించింది కేంద్రం కాదా? రాష్ట్రంలో రెమిడిసివర్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం స్పందించడం ద్వారానే రాష్ట్రంలో కరోనా బాధితులకు అందుతున్న విషయం వాస్తవం కాదా?ప్రజా సంక్షేమాన్ని ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం లక్ష్యంగా పెట్టుకున్నది.
ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆరోగ్యశాఖ సంబంధించిన అధికారులతో కానీ, క్యాబినెట్ తో సమావేశమై కానీ, ఇతర సంబంధిత అధికారులతో సమీక్షించిన దాఖలాలు లేవు అనే విషయం వాస్తవం కాదా? ప్రచార మాధ్యమాలకు కొంతమంది లీకులు ఇస్తూ ముఖ్యమంత్రి ప్రజారోగ్యంపై దృష్టి పెట్టారన్న అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్న విషయం వాస్తవం కాదా? గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్క ఆస్పత్రి నిర్మాణం చేసింది లేదు అనేది ఇది వాస్తవం కాదా? రోజు పత్రికలలో ప్రచార మాధ్యమాల లో కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి కనిపిస్తున్నారు తప్ప ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది అన్న ఒక్క విషయాన్ని కూడా నేటి వరకు తీసుకున్న చర్యలపై వివరించలేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రాష్ట్రంలో ప్రజలకు చేసింది ఏమీ లేదు వ్యాక్సినేషన్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలోో పెట్టుకోవాల్సిన మంత్రులు కుటిల రాజకీయాలుు చేయడంలో నిమగ్నమయ్యారు యుద్ధ విమానాలను రాష్ట్ర ప్రభుత్వమే వినియోగిస్తున్నారని గొప్పలుు చెప్పుకోవడం మానుకోవాలి కేంద్ర ప్రభుత్వం స్పందించడం ద్వారానే దేశంలో యుద్ధ విమానాలు సైతం ప్రజాాసంక్షేమం కోసం ఆరోగ్యం కోసం వినియోగిస్తున్నారని మంత్రులు తెలుసుకుంటే మంచిది. కరోనా బాధితులు టెస్టులు చేయించుకోవడానికి కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వంం గ్రహించకపోవడ దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపత్కాల సమయంలో కూడా దుర్మార్గంగా రాజకీయాలు చేయడంం తప్ప ఇంకొకటిి చేయటం లేదు ప్రైవేట్ యాజమాన్యాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి అన్న విషయం తమ దృష్టికిిి వచ్చింది అన్న మంత్రి ఏం చర్యలు ప్రజలకు వివరించాలి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారత్ బయోటెక్ చర్చలు జరిపితే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదు లో ఉండి కూడా వ్యాక్సినేషన్ పై చర్చించ కోవడం వారి నిర్లక్ష్యాన్నీ తెలియజేస్తున్నది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి కాలం వెళ్లదీసే ఆలోచనలో ఉన్నది ఇది అందరికీ వ్యాక్సినేషన్ వేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న వ్యాక్సినేషన్ తమ గొప్పతనం గా చెప్పుకోవాలని ఆలోచనే తప్ప ఇంకొకటి కాదు అందరికీ వ్యాక్సినేషన్ అన్నప్పుడు వివిధ కంపెనీలతో చర్చలు జరపాలన్న ఆలోచన లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించే వ్యవహారం చేస్తున్నారు. కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1250 వెంటిలేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కైనవి.
Also Read
కరోనాతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఒక సంవత్సరం నుండి ఒక డాక్టర్ ను కానీ ఆరోగ్య సిబ్బంది నికాన్ ఈ భర్తీ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఆరోగ్యాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రకటనలు మాని ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగాన్ని కరోనా పై యుద్ధం ప్రకటించడానికి సమాయత్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
-
August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
-
MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!