సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితాన్ని జనం రచ్చ చేయకూడదు. ఇవన్నీ మాట్లాడుకునేందుకు బాగానే ఉంటాయి కానీ… ప్రస్తుత సొషల్ మీడియా యుగంలో ‘వ్యక్తిగతం’ అంటూ ఏదైనా ఉంటుందా? అదీ బాలీవుడ్ లాంటి గ్లామర్ ఫీల్డ్ లో బోలెడు పేరు, డబ్బు సాధించుకున్నాక పబ్లిక్ అంత ఈజీగా వదిలేస్తారా? ఇప్పుడు కరీనా, సైఫ్, తైమూర్ కు అదే పెద్ద గండంగా మారింది… తైమూర్ పుట్టాక సైఫీనా మొదటి వారసుడి పేరు విషయంలో పెద్ద రచ్చే జరిగింది. లక్షల మంది ప్రాణాలు తీసిన తైమూర్ చక్రవర్తిని గుర్తుకు తెచ్చేలా బెబో, సైఫ్ తమ కొడుకు పేరు పెట్టడం అప్పట్లో వివాదానికి కారణమైంది. చాలా మంది వీలైనంత ట్రోలింగ్ చేశారు. అయితే, ఇప్పుడు కరీనా కపూర్ ఖాన్ రెండో వారసుడి పేరు కూడా కాంట్రవర్సీకే కారణమైంది!
సైఫ్, కరీనా తమ రెండో కొడుకు పేరు ‘జెహ్’ అన్నారు. అప్పుడు ఎవ్వరూ పెద్దగా ట్రోలింగ్ చేయలేదు. అయితే, మిసెస్ ఖాన్ ఈ మధ్యే ఓ బుక్ రాసింది. ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ అనే టైటిల్ తో వచ్చిన అందులో… ఓ ఫోటో కింద ‘జహంగీర్’ అని పేర్కొంది. ఇదే ఇప్పుడు చాలా మంది అభ్యంతరాలకు మూలమైంది. ‘జెహ్’ అంటే, నిజానికి ‘జహంగీరే’ అంటున్నారు కొందరు నెటిజన్స్. పైగా మొదటి కొడుక్కి తైమూర్ అని పేరు పెట్టారు. రెండో వాడికి జహంగీర్ అని నామకరణం చేశారు. చరిత్రలో తైమూర్ అనేక మంది హిందువుల్ని ఊచకోత కోసినవాడిగా ప్రసిద్ధి. ఇక మొఘల్ చక్రవర్తి జహంగీర్ కూడా సిక్కు గురువు అర్జన్ దేవ్ ను హింసించి చంపాడని హిస్టరీ పుస్తకాలు చెబుతున్నాయి. అటువంటి కర్కోటకులైన రాజుల పేర్లు ఎలా పెడతారని ట్రోల్స్ ప్రశ్నిస్తున్నారు? ఇంకా మంచి పేర్లే లేవా అంటూ వారు సూటిగా జవాబు అడుగుతున్నారు! కరీనా, సైఫ్ ఏం చెబుతారో చూడాలి మరి…