ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక అనుమానితుడిని ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నటుడిపై దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. దుండగుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
జనవరి 15 అర్థరాత్రి నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ గొడవలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌న్ని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే సైఫ్ అలీఖాన్‌ను ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లిందెవరన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. పెద్ద కొడుకు ఇబ్రహీం అర్ధరాత్రి సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడని వేర్వేరు నివేదికలలో పేర్కొన్నారు. అయితే…
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన దేశంలో చర్చనీయాశంగా మారింది. ఇంట్లోకి దూరిన దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగుడు ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా పారిపోవడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితాన్ని జనం రచ్చ చేయకూడదు. ఇవన్నీ మాట్లాడుకునేందుకు బాగానే ఉంటాయి కానీ… ప్రస్తుత సొషల్ మీడియా యుగంలో ‘వ్యక్తిగతం’ అంటూ ఏదైనా ఉంటుందా? అదీ బాలీవుడ్ లాంటి గ్లామర్ ఫీల్డ్ లో బోలెడు పేరు, డబ్బు సాధించుకున్నాక పబ్లిక్ అంత ఈజీగా వదిలేస్తారా? ఇప్పుడు కరీనా, సైఫ్, తైమూర్ కు అదే పెద్ద గండంగా మారింది… తైమూర్ పుట్టాక సైఫీనా మొదటి వారసుడి పేరు విషయంలో పెద్ద…
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తమ చిన్న కుమారుడికి పేరు పెట్టేశారు. ఈ విషయాన్ని కరీనా తండ్రి రణధీర్ కపూర్ వెల్లడించారు. మనవడి పేరు, ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించారు. ఫిబ్రవరి 2021లో తమ రెండవ కొడుకుకు స్వాగతం పలికిన కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ అతనికి ‘జెహ్’ (Jeh) అని పేరు పెట్టారు. ‘జెహ్’ అనేది లాటిన్ పదం. దీని అర్థం “బ్లూ క్రెస్టెడ్ బర్డ్”.…