విద్యాబాలన్ ను పొగిడిన కంగనా రనౌత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎవరినీ అంత తేలికగా పొగడదని అంటారు. అయితే అందులో వాస్తవం లేదు. తన భావాలను వ్యతిరేకించే వారిని విమర్శించడంలో ముందుండే కంగనా రనౌత్, కొందరిని మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా పొగుడుతూ ఉంటుంది. ఇటీవల అదే జరిగింది. దర్శకుడు మిలన్ లూధ్రియా ‘ది డర్టీ పిక్చర్’ను తొలుత కంగనా రనౌత్ తోనే తీయాలనుకున్నాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో ఆ పాత్ర విద్యాబాలన్ కు లభించింది. ఆ సినిమాతో విద్యా బాలన్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. ‘ది డర్టీ పిక్చర్’ కంటే ముందు మిలన్.. కంగనాతో ‘వన్స్ అపానే టైమ్ ఇన్ ముంబై’ మూవీ చేశాడు. ఆ కారణంగానే ‘ది డర్టీ పిక్చర్’ ఆఫర్ కూడా కంగనాకు ఇచ్చాడు. అయితే… ఈ సినిమా పొటన్షియాలిటీని గుర్తించడంలో తాను విఫలమయ్యానని, అందుకు ఇప్పుడేమీ బాధపడటం లేదని కంగనా తెలిపింది. విద్యాబాలన్ అందులో సిల్క్ స్మిత పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చిందని, ఆ పని తనవల్ల కాదని కూడా కంగనా అంగీకరించింది. విశేషం ఏమంటే… అప్పుడు సిల్క్ స్మిత బయోపిక్ ను తిరస్కరించిన కంగనా రనౌత్ ఇప్పుడు దక్షిణాది నాయిక, తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’ లో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇటీవలే ‘మణికర్ణిక, పంగా’ చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న కంగనాకు ‘తలైవి’ సైతం అవార్డును అందిస్తుందేమో చూడాలి.
Also Read
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
తాజావార్తలు
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
-
Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!